Thursday, May 16, 2024
- Advertisement -

పెళ్లికి రెడీ అయిన అనుష్క …ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో వైర‌ల్

- Advertisement -

హీరోయిన్ అనుష్క పెళ్లి ఇప్ప‌టికే చాలానే రూమ‌ర్లు వ‌చ్చాయి.వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తునే వ‌స్తుంది అనుష్క‌.గ‌తంలో హీరో ప్ర‌భాస్‌ను అనుష్క పెళ్లి చేసుకోబోతుంద‌ని ,గుజ‌రాత్‌కు చెందిన వ్యాపారస్థుడు కొడుకుని పెళ్లి చేసుకుంటుంద‌ని గతంలో చాల‌నే వార్తలు వ‌చ్చాయి.అవి అన్ని ఊట్టి వార్త‌లే అని అనుష్క తెల్చేశారు.తాజాగా అనుష్క పెళ్లి చేసుకుంటుంద‌ని మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.దీనికి కార‌ణం అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోనే కార‌ణం.కాలికి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసిన అనుష్క.. దీనికి క్యాప్షన్ అవసరం లేదు.. అని క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో అభిమానులంతా పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటూ అనుష్కని ప్రశ్నిస్తున్నారు. వచ్చేనెల 7న అనుష్క పుట్టినరోజు ఉండడంతో.. ఆరోజే పెళ్లి వార్త చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. పెళ్లి కబురు ఎప్పుడు వినిపించాబోతున్నారు.. మీ పుట్టినరోజునా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కామెంట్లపై అనుష్క స్పందించలేదు. చివరిగా ఆమె ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇప్ప‌టికి అయిన అనుష్క పెళ్లిపై ఏ వార్త చెబుతుందో చూడాలి.

https://www.instagram.com/p/Bpb20StlfT1/?utm_source=ig_embed

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -