Thursday, May 2, 2024
- Advertisement -

సీసీ ఫుటేజీ స‌ప్వాధీనం….ప‌చ్చ‌బ్యాచ్‌కి ద‌బిడి దిబిడేనా…?

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఇది ప‌క్కాగా జ‌గ‌న్‌ను హ‌త్య‌చేయ‌డానికే ఈదాడి జ‌రినిన‌ట్లు వైసీపీనేత‌లు ఆరోపిస్తున్నారు. ఏపీ డీజీపీ ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా నాగేశ్వరరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.అయినా విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్ఢా కూడ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. విచార‌ణ జ‌రిగే కొద్దీ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

నిందితుడు జగన్ ను హత మార్చడానికే వచ్చాడని పోలీసులు నిర్ధార‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. నిజంగా అదే కత్తి కనుక గొంతు లో దిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదని విచార‌న‌లో తెలుస్తోంది. మ‌రో వైపు టీడీపీనాయ‌కులు ఈ సంఘ‌ట‌న‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు విమ‌ర్శ‌లు చేశారు. ఈ పోలీస్ రిపోర్ట్ తో టీడీపీ నాయకులు మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు.

రిపోర్టులో వచినటువంటి కొన్ని సాక్ష్యాలు ఇప్పడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసే విధంగా ఉన్నాయి. పోలీసుల యొక్క రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నట్టుగా జగన్ కు తగిలింది చిన్న గాయం కాదని,దాదాపు మూడు ఇంచుల లోతుకు ఆ కత్తి దిగిందని తెలిపారు,అంతే కాకుండా అదే కత్తి వేటు గాని మెడ మీదనే గాని తగిలి ఉంటే జగన్ యొక్క ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు పొందుపరిచిన రిపోర్టులో తెలిపారు.

శ్రీనివాసు రావు తో పాటు అతనికి సహకరించినటువంటి మరో ముగ్గురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.కత్తి జగన్ యొక్క భుజానికి తగలడం అదృష్టమని, అదే మెడ మీద గాని తగిలితే పెద్ద ఘోరమే జరిగి ఉండేదని రిపోర్టులో తెలిపారు.

నెల రోజులుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సీసీటీవీ పుటేజీని పోలీసులు సేకరించారు.ఈ నెల రోజులుగా శ్రీనివాసరావు కదలికలపై సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు ఆరా తీసయనున్నారు. ఆరు మాసాలుగా శ్రీనివాసరావు కదలికలపై కూడ పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

ముమ్మడివరం మండంలంలోని ధనియాపాలెం నుండి కత్తిని శ్రీనివాసరావు తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్‌లోకి కత్తిని ఎలా తీసుకొచ్చారనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -