Friday, May 10, 2024
- Advertisement -

జ‌న‌వ‌రి 26న అనుష్క సినిమా విడుద‌ల‌

- Advertisement -

సూప‌ర్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అనుష్క శెట్టి బాహుబ‌లి సినిమాల‌తో అద‌ర‌గొట్టింది. క‌థ‌నాయిక పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న అనుష్క ఇప్పుడు భాగ‌మ‌తిగా వ‌స్తోంది. బ‌హుబ‌లి ది న్‌క్లూజ‌న్‌లో అందాల‌తో ఆక‌ట్టుకున్న దేవ‌సేన వ‌చ్చే సంవ‌త్స‌రం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు `భాగ‌మ‌తి` సినిమాతో అనుష్క థియేట‌ర్ల‌కు రానుంది.

ఈ విష‌యాన్ని అనుష్క త‌న ఫేస్‌బుక్ పేజీ ద్వారా పంచుకోంది. బాహ‌బ‌లి-2 త‌ర్వాత అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌చిత్రం భాగ‌మ‌తి. త‌ను ప్ర‌ధాన పాత్ర‌తో వ‌చ్చిన సినిమాల‌న్నీ మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచ‌నాలు పీక్‌గా ఉన్నాయి. ఈ సినిమా విడుద‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్వీటీ బ‌ర్త్ డే రోజు భాగ‌మ‌తి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ఒక చేత్తో సుత్తి ప‌ట్టుకొని మ‌రో చేయి పైకి పెట్టి త‌ల కింద‌కు వంచుకొని అనుష్క నిల‌బ‌డింది. ఆ డిఫ‌రెంట్ లుక్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చి ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగేలా ఉంటున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ లో జి. అశోక్ద ద‌ర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్‌, జయరాజ్‌, ఆశాశరత్‌, మురళీశర్మ ప్రధాన పాత్రలుగా ఉండ‌నున్నాయి. సినిమాను తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు స‌మాచారం. థ్రిల్‌, సస్పెన్స్‌ కథాంశంతో ఈ సినిమా ఉండ‌నుందని ఫ‌స్ట్‌లుక్‌తో తెలుస్తోంది. అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ త‌ర్వాత భాగ‌మ‌తి అనుష్క కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రంగా ఇది నిలుస్తుంద‌ని చిత్ర బృందం భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -