Sunday, May 5, 2024
- Advertisement -

నైట్ స్విచ్ఛాప్ చేయలేదో.. మీ స్విచ్ ఆగిపోతుంది…

- Advertisement -

మన పెద్దోళ్ళు ఏది ఊరికే చెప్పలేదు. ‘అతి అనర్థదాయకం’ అంటూ వారు చెప్పిన ప్రతి బాట మనకు అనుభవంలోకి వస్తే గాని వినడం లేదు. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కొన్ని సందర్భాలలో సమస్య పీకలమీదకు వస్తే గాని తెలియదు. ఇది శృంగారం విషయంలో కరెక్ట్ గా సరిపోతుంది. రీసెంట్ గా ఇండియా టుడే నిర్వహించిన ఓ సెక్స్ సర్వే ఎన్నో నిజాలను బయట ప్రపంచం ముందు పెట్టింది.

ఇండియా టుడే చేసిన సర్వా ప్రకారం …’ఏకాంత దృశ్యాల్ని’ స్మార్ట్ ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకోవడం తమ అలవాటు అంటూ దాదాపు 20 శాతం జంటలు ఓపెన్ గా ఒప్పేసుకున్నాయట. ఏదో సరదాకు, ఒక ఫ్యాషన్ తో చేసే ఈ పిచ్చి పని… దేశమంతా ఇల్లీగల్ పోర్నోగ్రఫీ పెరిగిపోవడానికి కారణమవుతుందనేది వాస్తవం కాదా ? కొన్ని జంటలు చేసే ఈ పనుల వల్ల తమతో పాటు సివిక్ సొసైటీకి జరిగే డామేజ్ చాలా ఎక్కువ. బై మిస్టేక్ ‘సొంత సెక్స్ వీడియోలు’ బైటికి వెళితే… బ్లాక్ మెయిల్, డైవోర్స్, సూసైడ్ లాంటి విపరీతాలు కూడా జరిగిపోతుంటాయి. దీని నుంచి బయట పడాలనే ఉద్దేశ్యంతో ‘షట్ ది ఫోన్ అప్’ అంటూ యూనిక్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది ‘మ్యాన్ ఫోర్స్’ కండోమ్ తయారీ కంపెనీ.

భార్య భర్తలు ”శృంగారానికి రెఢీ అయ్యే ముందు మీ సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోండి” అనేది ‘మ్యాన్ ఫోర్స్’ వైరల్ చేయదలచుకున్న స్లోగన్. దీనికి సంబందించి ఓ వీడియో కూడా రూపొందించింది. ‘మ్యాన్ ఫోర్స్’ బ్రాండ్ ప్రమోషన్ కోసమే ఈ ప్రయత్నం జరుగుతున్నప్పటికీ.. ఇందులో బలమైన సోషల్ కాజ్ ఉండడంతో.. ‘షట్ ది ఫోన్ అప్’ ఉద్యమం ఇప్పటికే జనంలోకి బాగా వెళ్లిపోయింది.ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం రాత్రుళ్లు స్మార్ట్ ఫోన్లు ఆన్ చేసి ఉంచితే దాని ద్వారా వచ్చే రేడియేషన్ తో సెక్స్ సమస్యలు చాలానే వస్తాయి. సో ఫోన్ స్విచ్చాఫ్ చేయండి..శృంగారిని ద్వారాలు ఆన్ చేయండి. మరింత స్పష్టంగా విషయం తెలుసుకోవాలంటే మాత్రం..ఈ వీడియో చూండండి.

https://www.youtube.com/watch?v=E7GKHi0bYYo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -