Monday, May 6, 2024
- Advertisement -

ఈ చంద్ర‌బాబు ఏంటీ ఇలా ఉన్నాడు.!

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్‌లో హడావిడి ఎక్కువుగా క‌నిపిస్తుంది.మ‌హ‌న‌టితో మొద‌లైన ఈ బ‌యోపిక్ సినిమాలు ప్ర‌స్తుతం తార స్థాయికి చేరాయి.ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రులు అయిన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి ,ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి.ఇక మ‌రో ప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడి జీవిత క‌థ‌ను కూడా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.చంద్రోదయం పేరుతో తెర‌కెక్కుతున్న చంద్ర‌బాబు పాత్ర‌ను వినోద్ నువ్వుల న‌టిస్తున్నాడు.

తాజ‌గా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.వినోద్ నువ్వుల చంద్రబాబు పాత్ర కోసం బాగానే ట్రై చేశాడు కాని ,అది పెద్ద‌గా వ‌ర్క్ అవుట్ కాలేద‌ని అనిపిస్తుంది.చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ గెడ్డం స్టైల్ బాగానే ట్రై చేశారు. ఇక ఆయన ఐకానిక్ అభివాదం కూడా బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ఈ ఫస్ట్ లుక్ పై భిన్న అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేందర్ నిర్మిస్తున్నారు. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి రాజకీయాల్లోకి ఆయన ఎలా ఎదిగారు అనే అంశాలను సినిమాలో చూపించ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -