Wednesday, May 15, 2024
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘నోటా’లో మురుగదాస్

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌స సినిమాతో దూసుకుపోతున్నాడు.గీతా గోవిందం హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ.దీంతో త‌న త‌రువాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు.విజ‌య్ న‌టిస్తున్న నోటా సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది.అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం త‌మిళ స్టార్ ద‌ర్శ‌కుడు మురుగదాస్‌ని తీసుకున్నార‌ని తెలుస్తుంది.ఈ చిత్రంలో డైరెక్టర్ ఆనంద్ శంకర్ ఏరికోరి తన గురువు మురుగదాస్ చే ఓ రోల్ చేయిస్తున్నారు.

అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ సీన్స్ ని ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. ఈ సందర్భంగా ఆనంద్ శంకర్ స్వయంగా ట్విట్టర్ లో మురుగదాస్ ఆన్ లొకేషన్ ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నోటా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కోటి వ్యూస్ దిశగా దూసుకుపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -