Thursday, May 9, 2024
- Advertisement -

బాబోయ్ ఇదేం ఐటెమ్ సాంగ్ ? ఏంటా పదాలు ?

- Advertisement -

ప్రముఖ దర్శకుడు శివగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సకళ కళా వల్లభుడు’ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. దసరాకు ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో చిత్రయూనిట్ ఉంది. అయితే రెండు రోజల క్రితం యూ ట్యూబ్ లో విడుదలైన ‘సకళ కళా వల్లభుడు’ సినిమాలోని ఓ ఐటెమ్ సాంగ్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. లక్షల వ్యూస్ తో, ఆ పాట హిట్ అయింది. కానీ అదే సమయంలో వివాదాస్పదమయింది. ఆ ఐటెమ్ సాంగులోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు, నిర్మాతలు, పాటల రచయిత, సంగీత దర్శకుడితో పాటు పాట పాడిన గీతామాధురిపై పై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దర్శకుడు శివగణేశ్ అంటే… కమర్షియల్ హిట్ కోసం ఇలాంటివి కోరి కోరి మరీ చేయించి ఉండవచ్చు. పాటల రచయత గిరిధర్ తో కావాలనే అలా రాయించి ఉండవచ్చు. కానీ ఓ మహిళగా గీతామాధురి అలాంటి పాటను ఎలా పాడింది ? అంటూ… తోటి మహిళలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఏమో…అది నాగేమ్ ఏమో…ఇది నా గేమ్ ప్లాన్ ఏమో…ఆయన చేయడం అతడి గేమ్ ఏమో….ఇలా అనడం నిజమేమో…అంటూ ఓ అయోమయం కంటెస్టెంట్ గా, కిడ్డిస్ మైండ్ సెట్ తో ‘నసమాధురి’గా గీతామాధురి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ఐటెమ్ సాంగ్ విషయంలోనూ అలాగే కిడ్డిస్ మైండ్ తోనే పాడిందా ? అంటూ కౌషల్ ఆర్మీ కూడా ట్రోల్స్ మొదలు పెట్టింది.

ఇంతకీ ‘సకళ కళా వల్లభుడు’ సినిమాలోని ఐటెమ్ సాంగ్ పై నెటిజన్ల అభ్యంతరాలు ఏంటంటే… ‘తిక్కరేగిన వంకరగాళ్లు…మట్టికొట్టిన పోకిరివీళ్లు…సకళ కళా వల్లభులు వీరేనయ్యా’…..అంటూ సాగే పాటలోని పదాలపైనే అభ్యంతరం. అందులో ఓ చరణంలో కొన్ని పదాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ‘మొగుడు చచ్చి ముండేమో మూలన పడితే రంకుమొగుడు విసిరాడా రాయిని… ఎందరున్న అందరికి దూల తీర్చెయ్ నాన్న…. దొంగముండ పెళ్లికేమో చావు మేళమా’ అంటూ…. సాగిన పదాలపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను కోల్పోయిన మహిళలను, వితంతువులు, వైదవ్యం ప్రాప్తించిన మహిళలు, వైదవ్యం పొందిన స్త్రీలు అని సంబోధిస్తుంటారు. ఎక్కడో కొందరు నిరక్షరాస్యులు మాత్రం ‘ముండ’ అనే కఠిన పదాలను వాడుతుంటారు. వాస్తవానికి ఈ పదం వాడటానికి ఇష్టపడనివారే ఎక్కువమంది. ఈ పదం అనటానికే, కాదు వినటానికి కుడా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా సెన్సిటివ్ వర్డ్ ఇది. కోపం కట్టలు తెంచుకున్నప్పుడు కొందరు మాట్లాడినా…కచ్చితంగా ఈ ‘ముండ’ అనే పదం అభ్యంతరకరమైనదే. భర్తను కోల్పోయిన మహిళలనుద్దేశించి అనే…ఆ పదాన్ని పాత ముతక సామెతలో వాడుతుంటారు. మొగుడు చచ్చి ముండేమో మూలనపడితే రంకుమొగుడు విసిరాడా రాయి… దొంగముండ పెళ్లికి మేళం…అంటూ పాడటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరైనా మహిళ భర్తను కోల్పోయారంటే పుట్టెడు దుంఖంలో ఉంటారు. అలాంటి వారిని కించపరిచేలా, అవమానించేలా, వారి మనోభావాలను దెబ్బతీసేలా, మనసుల్ని గాయపరిచేలా ఈ పదజాలం ఉందని ఆ పాటలోని కచ్చితంగా ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

కమర్షియల్ సినిమా తీయాలనే కసిలో దర్శకుడు శివగణేశ్ ఇలాంటి వివాదాస్పదమైన అంశాల జోలికి పోయి ఉండవచ్చు. కావాలనే అలాంటి పదాలతో పాట రాయించి ఓ రకమైన పబ్లిసిటీ ఆశించి ఉండవచ్చు. కానీ ఓ మహిళగా తోటి మహిళలను నొప్పించేలా, స్త్రీజాతిని అవమానించేలా ? ఎగతాళి చేసేలా ఉన్న పాటను గీతామాధురి ఎలా పాడిందబ్బా ? అని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ పాట పాడే ముందు ఓ సారి ఆమె ఆలోచించుకుని ఉండాల్సిందని ట్రోల్స్ చేస్తున్నారు. వితంతువులను కించపరిచేలా ఉన్న పదాలను తక్షణం తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిత్ర దర్శక నిర్మాతలు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి. గీతామాధురి తప్పును అంగీకరించి, ఇకపై ఇలాంటి పాటలు పాడబోనని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో పదే పదే లాజిక్కులు చెప్పి, అందర్నీ ఇన్ ఫ్లుయెన్స్ చేసే ఆమెకు ఇలాంటి పదాలున్న పాటలు పాడితే కోట్లమంది మహిళలు హర్ట్ అవుతారు…అనే లాజిక్ తట్టలేదా ? అని కౌషల్ ఆర్మీ ట్రోల్స్ చేస్తోంది. మరి సకళ కళా వల్లభుడిలోిని ఒక పాట విడుదలైతేనే దుమారం రేపింది. పూర్తి పాటలు ఇంకెలా ఉంటాయో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -