Saturday, May 18, 2024
- Advertisement -

అర‌వింద స‌మేత టీజ‌ర్ డేట్‌ వ‌చ్చేసింది…

- Advertisement -

అజ్ఞాతవాసి దారుణమైన ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కెరీర్‌లో మరో సక్సెస్‌ను చేర్చడానికి చిత్రాన్ని విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నారు

ఎన్టీఆర్ స‌ర‌స‌న క‌థాన‌య‌కగా పూజా హెగ్డే న‌టించనుంది. భారీ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఆయన సిక్స్ ప్యాక్ లుక్ బయటికి రావడంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు

ఈ సినిమాను దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమా పాటల చిత్రీకరణను ఇంకా మొదలుపెట్టకపోవడంతో, దసరాకి రిలీజ్ డౌటే అనే ప్రచారం మొదలైంది. దాంతో ఈ సినిమాను దసరాకి అంటే అక్టోబర్ 11వ తేదీన కచ్చితంగా విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు.

ఈ నెల 15వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఫస్టు లుక్ తో అందరినీ తన వైపుకు తిప్పుకున్న వీరరాఘవుడు, ఫస్టు టీజర్ తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -