Friday, April 26, 2024
- Advertisement -

బీజేపీ “ఆకర్ష్” ను.. టి‌ఆర్‌ఎస్ అమలు చేస్తోందా?

- Advertisement -

తెలంగాణలో బీజేపీ, టి‌ఆర్‌ఎస్ పార్టీల మద్య పోలిటికల్ హిట్ కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో కొత్తగా అధికారం చేపట్టాలని బి‌జే‌పి ప్రయత్నిస్తుంటే.. అధికారం నిలబెట్టుకొని మూడవసారి కూడా ప్రభుత్వం కొనసాగించాలని టి‌ఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా ముఖ్యంగా పరస్పర నేతలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్శించేందుకు చేరికల కమిటీ సంగతి తెలిసిందే. ఈ చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెల రాజేందర్ ను కూడా నియమించింది. ఇక ఈటెల ఇప్పటికే తన పాత పరిచయలతో టి‌ఆర్‌ఎస్ లోని ఇతర నేతలను ఆకర్షించే పనిలో తలమునకలై ఉన్నారు.

కొంత మంది టి‌ఆర్‌ఎస్ నేతలు కూడా ఇప్పటికే ఈటెల తో ఫోన్ ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంచితే బీజేపీ నుంచి టి‌ఆర్‌ఎస్ లోకి ఆకర్షితులౌతున్న నేతలు కూడా దండిగానే కనిపిస్తున్నారు. ఇది కాస్త బీజేపీకి అసంతృప్తి కలిగించే విషయం. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీజేపీ వీడి టి‌ఆర్‌ఎస్ గూటికి చేరారు. అంతే కాకుండా పెదపల్లి పాలకుర్తి మండలానికి చెందిన 50 బీజేపీ నేతలు కూడా టి‌ఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇలా మరికొంత మంది బీజేపీ నేతలు టి‌ఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి చూస్తే టి‌ఆర్‌ఎస్ నుంచి నేతలను ఆహ్వానించేందుకు ఈటెల ఆద్వర్యంలో ” ఆకర్ష్ మొదలు పెట్టిన బీజేపీకి.. సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీ మెల్లమెల్లగా తెలంగాణలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి కమలదళంలోకి చేరికలు భారీగానే పెరిగే అవకాశం ఉంది. అయితే రాజకీయాల్లో నేతలు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో చెప్పడం కష్టమే.

Also Read

మోడీని దూరం పెడుతున్న పవన్ ?

“గడప గడపకు ” జగన్ కు సమస్యేనా ?

తెలంగాణలో హీటెక్కిస్తున్న కాంగ్రెస్ రాజకీయం !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -