దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

- Advertisement -

దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పరచేందుకు పార్లమెంట్ ఎన్నికలు అలాగే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఇలా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. అయితే ఏ రెండు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు జమిలి ఎన్నికల పద్దతిని ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల పార్లమెంట్ లో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల విధానం లా పరిశీలనలో ఉందని తెలిపారు. ఈ ఎన్నికల విధానంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, అలాగే కేంద్ర ఎన్నికల సంఘంతో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు.

దీంతో పార్లమెంట్ కు అసెంబ్లీ కి ఒకే సారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతుంది. అయితే ఈ జమిలి ఎన్నికల విధానాన్ని కేంద్రం ఎందుకు ప్రవేశ పెట్టాలని చూస్తోంది ? అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న బీజేపీ ప్రాంతీయ స్థాయిలో చతికిలపడుతోంది. ముఖ్యంగా చాలా రాష్ట్రాలలో బిజీపీకి ప్రాంతీయ పార్టీల నుంచి ప్రధాన పోటీ ఎదురవుతోంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బిజిపి చాలా రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడంలేదు.

- Advertisement -

అందువల్ల పార్లమెంట్ ఎన్నికలు, అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల జాతీయ స్థాయిలో కొనసాగుతున్న బీజేపీ హవా.. రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. అందువల్లే జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది. అయితే ఇప్పటికే ఆంద్రప్రదేశ్ లో గత కొన్నేళ్లుగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా 2014 వరకు ఈ జమిలి విధానమే అమలవుతున్నప్పటికి..గత ఎన్నికలను మాత్రం కే‌సి‌ఆర్ కాస్త ముందుకు జరపడంతో.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఇక చాలా రాష్ట్రాలలో అసెంబ్లీకి, పార్లమెంట్ కి ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించబడుతున్నాయి. అయితే కేంద్రం తీసుకురాబోయే ఈ జమిలి ఎన్నికల విధానంపై ప్రాంతీయ పార్టీలు ఎలా స్తందిస్తాయో చూడాలి.

Also Read

మోడీ సర్కార్ పై గుర్రుగా ఉన్న వైసీపీ !

కే‌సి‌ఆర్ ను ప్రజలు నమ్మడం లేదా ?

కర్నూల్ లో హైకోర్టు.. ఇరకాటంలో జగన్ ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -