Saturday, April 27, 2024
- Advertisement -

మంత్రి ఈటల టీఆర్ఎస్ ని వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నారా?

- Advertisement -

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడనున్నారా? కొత్త పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ విషయం సీఎం కేసీఆర్ కు తెలిసే.. ఆదివారం నాటి సమావేశంలో పార్టీ కార్యకర్తలకు క్లాస్ పీకరా? అనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. గత కొంతకాలంగా ఈటల వ్యవహిరిస్తున్న తీరు, చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణమని భావించొచ్చు. మొదటి నుంచి కూడా ఈటల తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు వ్యక్తం చేస్తాడు. అయితే పార్టీకి వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ మాట్లాడని ఈటల.. ఇటీవల కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టే వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

గతంలో‘మేం టీఆర్‌ఎస్‌ జెండా ఓనర్లం.. కిరాయిదారులం కాదు’అని వ్యాఖ్యానించిన ఈటల.. ఈ మధ్య రైతుల ఆందోళన, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రభుత్వాన్ని కొంత ఇరుకునపెట్టే విధంగా మాట్లాడారనే అభిప్రాయం పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైంది. ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేయగా… ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలు ఉండాల్సిందేనని బహిరంగగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ బాగుందని టీఆర్ఎస్ నాయకులు అంటే ఇస్తుంటే .. మంత్రి ఈటల కేంద్ర బడ్జెట్ బాగాలేదని విమర్శించారు. ఇలా ప్రతి అంశంపై పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈటల మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వెళ్లి కొత్త పార్టీ పెట్టాలన్న ఉద్దేశం ఉండడం వల్లే మంత్రి ఈటల స్వరంలో మార్పు వచ్చిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతోనే ఆదివారం నాటి టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశంలో కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదనే వ్యాఖ్యలు చేశారనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ఈ విషయాన్ని ఓ వార్త చానెల్ మంత్రి ఈటల దగ్గర ప్రస్తావించగా.. ఆయన తీవ్రంగా ఖండించినట్లు సమాచారం.

ఆ కారు అంటే ‘బుట్ట బొమ్మ’కు ప్రాణం అట

కనిపించని జగనన్న ఫొటో.. ఆ ప్రచారం నిజమేనా?

వామ్మో.. నెలలో ప్రదీప్ ఇన్ని లక్షలు సంపాదిస్తాడా!

భ‌ళా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. న‌మ్మ‌కం నిల‌బెట్టుకున్నావు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -