పాపం ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ దానిపైనే..

- Advertisement -

మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించే హీరోయిన్లులో రెజీనా ఒక‌రు. ఆచితూచి సినిమాల‌ను ఎంచుకునే ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తో ప‌లువురిని ఆక‌ర్శిస్తుంది. అయినా కానీ ఈ మ‌ధ్య రెజీనా రోజు త‌గ్గింద‌నే చెప్పాలి. ఈ హీరోయిన్ శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ లోని ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను చేసింది.

ఆ మ‌ధ్య అడవి శేష్ నంటించిన ఎవరు మంచి విజ‌యాన్నే సాధించింద‌ని చెప్పాలి. కానీ ఈ సినిమా ఈ చిన్నదాని పాలిట పాపంగా మారింది. ఆ సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ప్రస్తుతం ఇతర భాషల్లో ఈ చిన్న‌ది న‌టిస్తోంది.

- Advertisement -

తమిళంలో ఈ హీరోయిన్ నటించిన నెంజమ్ మరప్పతిల్లై అనే మూవీ మార్చ్ 5న విడుదల కానుంది. హారర్ కథాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ ఈ సినిమా పై రెజీనా బోలెడన్ని ఆశలు పెట్టుకుంద‌ట‌. ఈ సినిమా లాక్ డౌన్ కన్నా ముందే విడుదల కావాలి. కానీ ప‌లు కార‌ణాల చేత ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా క‌నుక విజ‌యం సాధిస్తే.. మ‌ళ్లీ ఈ హీరోయిన్ బిజీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు.

ర‌ష్మికకు ఇలాంటి వీడియోలు చేయ‌డం మొద‌టిసార‌ట‌‌!

ప్రియాంక‌పై క‌న్నేసిన స‌లార్ డైరెక్ట‌ర్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -