Tuesday, May 21, 2024
- Advertisement -

సెట్స్‌లో బాలీవుడ్ హీరోపై దాడి

- Advertisement -
  • అర్జున్‌క‌పూర్‌పై మందుబాబు దాష్టీకం

అంతా ప్ర‌శాంతంగా ఉంది.. సినిమా షూటింగ్ చేస్తుండ‌గా ఓ వ్య‌క్తి వ‌చ్చి స‌డ‌న్‌గా దాడికి పాల్ప‌డ్డాడు. అదేదో దాడి చేసిందో ఎవ‌రినో కాదు ఏకంగా హీరోపైన‌. ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్‌ ‘సందీప్ ఔర్ పింకీ పరార్’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఉత్త‌రాఖండ్‌లో జ‌రుగుతోంది. సినిమా సెట్స్‌లో అనూహ్యంగా ఓ వ్య‌క్తి దాడితో చిత్ర యూనిట్ షాక్‌కి గురైంది.

షూటింగ్ చూసేందుకు కమల్‌కుమార్ అనే కారు డ్రైవర్ సెట్స్ వ‌ద్ద‌కు వెళ్లాడు. అతడు ఫుల్‌గా తాగి ఉన్నాడు. అర్జున్‌కపూర్‌కి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత మద్యం మత్తులో ఒక్కసారిగా హీరోపై విరుచుకుపడ్డాడు. వెంట‌నే స్పందించిన అర్జున్క త‌న వ్యక్తిగత సిబ్బందితో అతడిని వెనక్కు లాగివేయించాడు. ఈ ఘ‌ట‌న‌తో షాక్‌కు గుర‌య్యాడు. వెంట‌నే పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేయ‌గా అతడి డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేస్తామని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై హీరో త‌న ట్విట్ట‌ర్‌లో పంచుకున్నాడు. ‘మొత్తం ప్ర‌శాంతంగా ఉంది. నా ద‌గ్గ‌ర‌కు ఎవ‌రూ రాలేని ప‌రిస్థితి. ఆ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి దాడికి పాల్ప‌డ్డాడు. నా కుటుంబమంతా షాకింగ్‌లో ఉంది’ అని షేర్ చేసుకున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -