Sunday, April 28, 2024
- Advertisement -

సినిమా సినిమాకు ఓ రేంజ్‌

- Advertisement -
  • తీసిన‌ 8 సినిమాలు విభిన్నం
  • జ‌యాప‌జ‌యాలు డోంట్ కేర్‌
  • హ్య‌పీ బ‌ర్త్‌డే టూ సురేంద‌ర్‌రెడ్డి

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో తీసింది కేవ‌లం 8 సినిమాలు. కానీ పేరు పొందింది మాత్రం ఎంతో. సినిమా సినిమాకు ఎంతో తేడా ఉంటుంది. విభిన్న క‌థ‌ల‌తో సినిమా తీస్తున్న వ్య‌క్తి పుట్టిన రోజు నేడు (డిసెంబ‌ర్ 7). అత‌డే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌తో మొద‌లైన సినీ ప్ర‌యాణం మెగాస్టార్ చిరంజీవి సినిమా వ‌ర‌కు చేరుకుంది. 2005లో క‌ల్యాణ్‌రామ్‌తో అత‌నొక్క‌డే సినిమా తీసి తొలి హిట్ అందుకున్నాడు. తీసిన సినిమాల్లో మూడు ఫ్లాపులు, ఐదు హిట్లు పొందాడు.

స‌మాజానికి సందేశ‌మిస్తూనే యాక్ష‌న్స్‌, కామెడీ ఎలిమెంట్స్‌తో సినిమాలు తీశాడు. సామాజిక అంశాల‌పై ఎక్కువ‌గా దృష్టి సారించాడు. చిన్న వ‌య‌సులోనే మంచి సినిమాలు తీశాడ‌నే పేరు ఉంది. అత‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రెండు (అశోక్‌, ఊస‌ర‌వెల్లి), మాస్ మ‌హారాజ ర‌వితేజ‌తో రెండు (కిక్‌, కిక్‌-2), ప్రిన్స్ మ‌హేశ్‌బాబు (అతిథి), స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (రేసుగుర్రం), మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌తో (ధృవ‌) చెరో సినిమా చేశాడు.

`ధృవ` సినిమాతో త‌న‌కు హిట్ ఇచ్చినందుకు రామ్‌చ‌ర‌ణ్‌తేజ త‌న తండ్రి సినిమాకు అవ‌కాశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో చారిత్రాత్మ‌క‌మైన సినిమాను సురేంద‌ర్‌రెడ్డి తీస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. అందుకే ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఈ సినిమాను ప‌క్కాగా ప్లాన్ వేస్తున్నారు. ఈ సినిమా బాహుబ‌లి మాదిరి జాతీయ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ విధంగా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటూ సురేంద‌ర్‌రెడ్డికి ‘ఆద్య మీడియా’ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతోంది. మంచి మంచి సినిమాలు రావాల‌ని కోరుకుందాం.

అయితే సురేంద‌ర్‌రెడ్డికి చిత్ర‌బృందం జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెప్పింది. కొణెదెల ప్రొడ‌క్ష‌న్స్ ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటో షేర్ చేసింది. చిరంజీవితో సురేంద‌ర్‌రెడ్డి క‌లిసి ఉన్న విడుద‌ల చేశారు.

సురేంద‌ర్‌రెడ్డి తీసిన సినిమాలు
2005 అత‌నొక్క‌డే
2006 అశోక్
2007 అతిథి
2009 కిక్‌
2011 ఊస‌ర‌వెల్లి
2014 రేసుగుర్రం
2015 కిక్‌-2
2016 ధృవ‌
2017 సైరా (ప్ర‌స్తుతం షూటింగ్‌లో ఉంది)

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -