Sunday, April 28, 2024
- Advertisement -

పెళ్లి కాకుండానే తండ్రి అయిన హీరో..!

- Advertisement -

ఇటీవ‌ల కాలంలో పెళ్లి కాకుండానే త‌ల్లి అయిన హీరోయిన్లను చాలామందిని చూశాం. హీరోయిన్ అమీజాక్స‌న్ పెళ్లి కాకుండానే త‌ల్లి అయింది. ఓ ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌తో చాలాకాలం డేటింగ్ చేస్తున్న అమీ జాక్సన్ పెళ్లి కాక‌ముందే అత‌ని వ‌ల్ల గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేయ‌డం విశేషం.

క‌మ‌ల్ హాస‌న్ కూతురు హీరోయిన్ శృతి హాస‌న్ ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు పెళ్లి కాకుండానే పిల్ల‌ల‌ను క‌నాల‌ని ఉంద‌ని చెప్పి సంచ‌ల‌నం రేపింది. తాజాగా బాలీవుడ్ హీరో పెళ్లి కాకముందే తండ్రిగా మారాడు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తండ్రి కాబోతున్నట్లు ప్ర‌క‌టించాడు. తన ప్రేయసి గాబ్రియేలాతో గ‌త కొంత‌కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఆమె ఇప్పుడు గ‌ర్భ‌వ‌తి అయిన తెలిపాడు రాంపాల్‌. అయితే గ‌తంలోనే అర్జున్ రాంపాల్‌కు వివాహం అయింది. ఆయ‌న‌కు ఇద్ద‌రు కూతుర్లు కూడా ఉన్నారు.

గతేడాది భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు రాంపాల్. అప్ప‌టి నుంచి గాబ్రియేలాతో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు రాంపాల్‌. పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్నా అర్జున్ రాంపాల్ గాబ్రియేలాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే అర్జున్ రాంపాల్ మొద‌టి భార్య కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. కూతురు హీరోయిన్‌గా ఇచ్చే స‌మ‌యంలోనే , మ‌రో బిడ్డ‌కు తండ్రి అవుతున్నాడు అర్జున్ రాంపాల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -