Thursday, May 2, 2024
- Advertisement -

అర్జున్‌రెడ్డి బిగ్గెస్ట్ రికార్డ్…. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక ధరకు బాలీవుడ్ రీమేక్ రైట్స్

- Advertisement -

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని అర్జున్‌రెడ్డి సినిమా ప్రభావితం చేసినంతగా ఇంకెవ్వరూ చెయ్యలేదేమో. అర్జున్‌రెడ్డి పుణ్యమా అని ఆల్రెడీ సినిమా నిడివి విషయంలో ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ చాలానే ధైర్యం చేస్తన్నారు. టెంపర్ సినిమా టైంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ కూడా అటూ ఇటూగా రెండు గంటల నిడివిని మించకూడదని ప్లాన్ చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం అందరూ కూడా మూడు గంటల నిడివి రేంజ్‌లోనే ఆలోచిస్తున్నారు. రంగస్థలం, భరత్ అనే నేను….రాబోయే నా పేరు సూర్య….పై కూడా అర్జున్‌రెడ్డి ప్రభావం ఉందనడంలో సందేహం లేదు.

ఇక ఇప్పుడు అర్జున్‌రెడ్డి ఖాతాలో మరో బిగ్గెస్ట్ రికార్డ్ పడింది. అది కూడా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ కావడం గమనార్హం. అర్జున్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్ రైట్స్ 7 కోట్లకు అమ్ముడుపోయాయి. చిరంజీవి సినిమాలతో సహా మహేష్, పవన్, ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా ఇప్పటి వరకూ ఐదు కోట్ల లోపు అమ్ముడుపోయినవే. అయితే అర్జున్‌రెడ్డి రీమేక్ రైట్స్ మాత్రం 7 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పటికే తమిళ్ రీమేక్ రైట్స్‌తో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి టీం ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ రైట్స్‌తో భారీ ఆఫర్ కొట్టేసింది. తమిళ్‌లో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు అర్జున్‌రెడ్డిగా కనిపించనుండగా……బాలీవుడ్ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -