Thursday, May 16, 2024
- Advertisement -

కోహ్లీకీ రూ .12 ల‌క్ష‌ల భారా జ‌రిమానా విధించిన ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌….

- Advertisement -

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ మేనేజ్ మెంట్ భారీ జరిమానా విధించింది. నిన్న చెన్నైతో జరిగిని మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు నమోదు కావడంతో కోహ్లీపై రూ. 12 లక్షల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమని… అందుకే జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది.

నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నైకు బెంగళూరు జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ… ఆ తర్వాత పుంజుకున్న చెన్నై జట్టు చివరకు ఘన విజయం సాధించింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్ణీత సమయానికి ఓవర్లు వేయలేకపోవడంతో ఈ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించింది. ‘ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్‌ ఓవర్‌ రేట్‌‌ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని ఐపీఎల్‌ నిర్వాహకులు మీడియాకు లేఖ విడుదల చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -