- Advertisement -
అరవింద్ స్వామి. అందగాడికి ధీటైన నిర్వచనం. అది నచ్చే….. రోజా, బొంబాయి చిత్రాల్లో అరవింద్ ను అభిమానులు ఆకాశానికి ఎత్తేశారు. ఆ తరువాత సొంత వ్యాపారాల్లో బిజీ అయిపోయి సినిమాలకు దూరమైపోయాడు.
అయితే సఖితో తనకు లైఫ్ నిచ్చిన డైరెక్టర్ చిత్రంలోనే స్పెషల్ రోల్ చేసి ప్రేక్షకుల కోసం కాకుండా…నటుడిగా తనని తాను శాటిస్పై చేసుకున్నాడు. మళ్లీ గ్యాప్ తీసుకుని కడలితో చర్చి ఫాధర్ గెటప్‌లో ఇరగదీశాడు.
ఐతే ‘తని ఒరువన్’ చిత్రంలో అరవిందుడు విలన్ పాత్ర వేసి కోలీవుడ్ జనాలకు ఆశ్చర్యపరిచాడు. తనకిచ్చిన పాత్ర వరకు శభాష్ అనిపించడంతోరానున్న స్మార్ట్ విలన్ ను తమిళ తంబీలు చేసే అవకాశం లేకపోలేదు.