Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ మేనల్లుడి టైటిల్ టీజర్ డేట్ ఫిక్స్..!

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఆయన వారసుడిగా మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతూ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, నరేష్, సత్య,అర్చన,సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేసినట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసింది.

ఈ పోస్టర్లో అశోక్ గల్లా గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. పోస్టర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. చాలా రోజులుగా షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల తర్వాత అప్డేట్ వచ్చింది. పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. మొదట దిల్ రాజు నిర్మాణంలో అశోక్ హీరోగా సినిమా మొదలైంది. ఏ కారణాల వల్లో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాను మొదలు పెట్టారు.

Also Read

ఎన్టీఆర్, చరణ్ ల మీద సాంగ్.. చిత్రీకరణకే 20 రోజులు..!

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -