Thursday, April 25, 2024
- Advertisement -

ఎన్టీఆర్, చరణ్ ల మీద సాంగ్.. చిత్రీకరణకే 20 రోజులు..!

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనం ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం). మెగా, నందమూరి అంటే చాలు మొదటి నుంచి వారి మధ్య బాక్సాపీస్ వద్ద వార్ నడుస్తోంది. అలాంటిది మెగా, నందమూరి హీరోలు అయిన ఎన్టీఆర్, చరణ్ లను ఒకే సినిమాలో చూపిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించగానే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఇందుకు తగ్గట్టుగా సినిమా విడుదల తేదీ కూడా పలుసార్లు వాయిదా పడింది. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబరు 13న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్ కి కూడా సినిమా విడుదలయ్యే అవకాశం లేదని, వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ సీజన్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: కేజీఎఫ్​- 2 రాక ఇప్పట్లో కష్టమే.. !

కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ మధ్య ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు సాగే ఒక పాట ఉందని సమాచారం. ఈ సాంగ్ ఏకంగా ఇరవై రోజుల పాటు చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఒకే పాటలో ఎన్టీఆర్, చరణ్ ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు కనిపించనుండడంతో ఆ సాంగ్ ఎలా ఉంటుందా అని మెగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -