Thursday, May 2, 2024
- Advertisement -

ఆసిన్ కు ఎందుకో ఆ బాధ!

- Advertisement -

తనకు ఏమాత్రం సంబంధం లేని అంశం లో తలదూర్చి ఇప్పుడు పోలీస్ కేసు పెడతాను అంటోంది హీరోయిన్ అసిన్. అది కూడా విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల వ్యవహారానికి సంబంధం ఉన్న వ్యవహారంలో అసిన్ కోర్టుకు వెళతాను..

పోలీసు కేసు పెడతాను అనడం ఆసక్తికరంగా ఉంది! మరి వాళ్ల వ్యవహారంలో అసిన్ కు సంబంధం అంటే.. ఏం సంబంధం లేదు. అయితే ఈమె తలదూర్చి వివాదాన్ని సృష్టిస్తోంది.

క్రికెట్ ప్రపంచకప్ సెమిస్ లో టీమిండియా ఓటమి నేపథ్యంలో చాలా మంది అనుష్క శర్మపై దుమ్మెత్తిపోశారు. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీ ఫెయిల్యూర్ కు కారణం అనుష్కానేనని కొంతమంది విమర్శలు చేశారు. సోషల్ సైట్లలో ఇలాంటి అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అసిన్ స్పందించింది. తనకేం సంబంధం లేకుపోయినా.. విరాట్ , అనుష్కలకు మద్దతుగా నిలిచింది.  విరాట్ ఫెయిల్యూర్ తో అనుష్కకు సంబంధం లేదని అసిన్ చెప్పుకొచ్చింది. 

అయితే ఇంతలో ఎవరో అసిన్ ను టార్గెట్ చేశారట. నువ్వు అనుష్కకు మద్దతుగా నిలవడం ఏమిటి? అంటూ అసిన్ తీరును వ్యతిరేకిస్తూ ఒక వెబ్ సైటే క్రియేట్ చేశారు. దీంతో అనుష్కకు కోపం వచ్చింది.. ఈ విషయంపై తను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటోంది. మరి తనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ వ్యవహారం గురించి అసిన్ ఎంత వరకూ వెళుతుందో! 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -