Saturday, May 18, 2024
- Advertisement -

మరీ ఇన్ని ప్రగల్బాలు అవసరమా చంద్రబాబూ!

- Advertisement -

మరి ఇలాంటి మాటలు విని మురిసిపోవాలో.. నవ్వుకోవాలో అర్థం కాదు. తెలుగుదేశం అధ్యక్షుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అలా ఉంటున్నాయి.

సీమాంధ్రలో సింగపూర్ ను ప్రతిష్టింపజేస్తామని అనడం దగ్గర నుంచి బాబు గారు జనాలను అలరించడానికన్నట్టుగా తనకు తోచిన మాటలనేవో చెబుతూనే ఉన్నాడు. కేవలం సింగపూర్ లాంటి రాజధాని అనడమే కాదు.. ఏ ఊరికి పోయినా.. ఊరి గురించి బాబు ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. ఇలా చెప్పే మాటలు కామెడీ కామెడీగా ఉంటున్నాయి.

అనంతపురం వెళితే.. దాన్ని ఐటీ హబ్ గా మారుస్తానంటాడు, విశాక వెళితే దాన్ని సిలికాన్ సిటీ అంటాడు! కార్యరూపం దాల్చడం ఏమిటోకానీ.. మాటల్లో మాత్రం చంద్రబాబు విశ్వరూపాన్ని చూపుతున్నాడు. బాబుగారి తాజా హామీ ఏమిటంటే.. ఒంటిమిట్టను తిరుమల స్థాయిలో డెవలప్ చేస్తారట! బాబు మాటల్లో ప్రాస, పోలికలు లేనట్టుగానే ఈ మాటల్లో అర్థం కూడా లేదు! 

ఏదో కాసేపు అక్కడ ఉన్న జనాలను అలరించడానికి అన్నట్టుగా తిరుమల లా తీర్చిదిద్దుతాను అన్నాడనుకోవాలి. ఎందుకంటే.. తిరుమల లా అంటే అది ఎవరో తీర్చిదిద్దితే తయారు అయ్యేది కాదు! తిరమలకు శతాబ్దాల చరిత్ర ఉంది. అలాగని ఒంటిమిట్టకు లేదని కాదు.. ఒంటిమిట్ట ఒంటిమిట్టే.. తిరుమల తిరుమలే! దేని ప్రత్యేకత దానిది. ఇక అభివృద్ధి అంటే.. తిరుమల అభివృద్ధి ఏ ప్రభుత్వాలో చేయలేదు! అది ప్రజల సొమ్ముతో అభివృద్ధి చెందింది. వెంకన్నకు భక్తులు సమర్పించుకొన్న కానుకలతో అలా తీర్చిదిద్దబడింది. అంతే కానీ.. బాబులాంటి వాళ్లు తిరుమలను తీర్చిదిద్దలేదు.. సొంత శక్తులతో మరో తిరుమలను సృష్టిద్దామన్నా సాధ్యం కాదు. మరి ఈ మాత్రం విజ్ఞత వినే జనాలకు కూడా ఉంది. అయితే చెప్పే తెలుగుదేశం అధ్యక్షుడికి మాత్రం ఉన్నట్టుగా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -