Tuesday, May 21, 2024
- Advertisement -

నేటి తరానికి అనుగుణంగా మార్పులు

- Advertisement -

అసెంబ్లీ రౌడీ. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమా. ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. భారీ హిట్ తో పాటు బంపర్ కలెక్షన్లు కూడా రాబట్టిన అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని రీమెక్ చేయనున్నారు. ఈ కొత్త అసెంబ్లీ రౌడీ సినిమాలో హీరో పాత్రను అంటే.. మోహన్ బాబు పాత్రను ఆయన కుమారుడు మంచు విష్ణు పోషించనున్నారు.

పాతికేళ్ల క్రితం విడుదలై సంచలనం తీసుకువచ్చిన అసెంబ్లీ రౌడీ చిత్రం రీమేక్ కు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరో ఇంకా నిర్ణయించలేదు. తండ్రికి అతి పెద్ద హిట్ ఇచ్చి నిలబెట్టిన అసెంబ్లీ రౌడీ చిత్రం తనను కూడా స్టార్ ని చేస్తుందని విష్ణు ఆశిస్తున్నారు. నేటి తరానికి తగ్గట్టుగా కథను, సన్నివేశాలను మార్చి తీయాలని భావిస్తున్నారు. మరి తండ్రికి సూపర్ హిట్ ఇచ్చిన సినిమా కుమారుడ్ని ఏం చేస్తుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -