Sunday, May 19, 2024
- Advertisement -

అమెరికాలో తుది శ్వాస విడిచిన మహ్మద్ ఆలీ

- Advertisement -

ఆయన పంచ్ లు బరిలో నిలిచిన వారికి చుక్కలు చూపించాయి. పిడికిలి బిగించి ఒక్కటిచ్చాడంటే ప్రత్యర్ధి పని అంతే. ప్రపంచమంతా అభిమానించే బాక్సింగ్ క్రీడాకారుడు గ్రేట్ మహ్మద్ ఆలీ కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆలీ శనివారం ఉదయం మరణించారు. ఆయన మరణానికి ముందు బతికే అవకాశాలు తక్కువని డాక్టర్లు సన్నిహితులకు చెప్పారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆలీ అంత్యక్రియలకు ఏర్పాట్లు సైతం చేశారు. మహ్మద్ ఆలీ 20 శతాబ్దంలో గొప్ప క్రీడాకారునిగా వెలుగొందారు. బాక్సింగ్ క్రీడలో తిరుగులేని రారాజుగా ఉన్నారు.  దిగ్రేటెస్ట్ అని అభిమానులు పిలుచుకునే మహ్మద్ ఆలీ 1981 సంవత్సరంలో క్రీడకు దూరమయ్యారు. 74 సంవత్సరాల ఆయన ఇప్పుడు మొత్తం లోకానికే దూరమయ్యారు.

తన బాక్సింగ్ కెరీర్ లో 56 విజయాలు, కేవలం ఐదు పరాజయాలు మాత్రమే చూశారు. హెవీ వెయిట్ ఛాంపియన్ గా మూడుసార్లు టైటిల్ సాధించిన ఆలీ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం, ఆలీ కుమార్తె లైలా కూడా తండ్రిలాగే బాక్సింగ్ క్రీడనే తన కెరీర్ గా ఎంచుకోవడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -