హీరోయిన్ శృతిహాసన్ స్టార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచియమై తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాందించింది.కెరీర్ మొదట్లో అన్ని ప్లాప్‌లే ఎదుర్కోన్న శృతి తెలుగులో పవన్ కల్యాణ్ సరసన గబ్బర్‌సింగ్ సినిమాతో తొలి హిట్ కొట్టింది. తరువాత వరుస పెట్టి సినిమాలు చేసి మంచి నటనతోపాటు, డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చకుంది.బేసిక్‌గ్గా సింగర్ అయిన శృతి కొన్ని పాటలు కూడా పాడింది. కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడే సినిమాలు తగ్గించేసింది.బయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతు సినిమాలు మానేసింది. ఓ దశలో శృతికి పెళ్లి కూడా జరిగిందని వార్తలు వచ్చాయి.అలాంటి సమయంలోనే శృతి బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
దీనికి ఓకే చెప్పిన శృతి మరో తెలుగు సినిమాను కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది.మాస్ రాజా రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ని తీసుకుంటున్నట్లు సమాచారం.సినిమా కోసం శృతిని సంప్రదిస్తే …శృతి ఓకే చేసినట్లు తెలుస్తుంది. అంతకముందు రవితేజ-శృతిహాసన్ జంటగా బలుపు సినిమా చేశారు.ఈ సినిమా మంచి హిట్ అయింది.