Saturday, April 20, 2024
- Advertisement -

నానితో తీస్తే హిట్ సినిమా తీస్తా

- Advertisement -

తొలి సినిమాతో ఇద్ద‌రు న‌టులుగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ప‌రిచ‌య‌మై ఏళ్లు దాటుతున్నా వారు స్నేహితులుగా మారి వారి బంధాన్ని బ‌లోపేతం చేసుకుంటున్నారు. వారిద్ద‌రే న్యాచుర‌ల్ స్టార్ నాని, న‌టుడు, ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ అవ‌స‌రాల‌. వీరిద్ద‌రి తొలి సినిమా అష్టాచ‌మ్మ‌. ఆ త‌ర్వాత మ‌రికొన్ని సినిమాల్లో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించారు. శ్రీనివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌కుడిగా మారి `ఊహ‌లు గుస‌గుస‌లాడే, జ్యో అచ్యుతానంద` సినిమా లు తీశాడు.

ఇప్పుడు త‌న స్నేహితుడు నాని కోసం ఓ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. అయితే ఇంత‌కుముందు రాసుకున్న క‌థ‌ను కొట్టేసి కొత్త క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. తీస్తే హిట్ సినిమానే తీయాల‌ని, త‌న స్నేహితుడికి హిట్ సినిమా ఇచ్చి మంచి కానుక అందిస్తాన‌ని శ్రీనివాస్ ఉన్నారు. నానీ హీరోగా సినిమాకు సర్వం సిద్ధమైనా అవసరాల హఠాత్తుగా సినిమా కథ మొత్తం మార్చేశాడని తెలుస్తోంది.

నానిని హీరోగా ఓ సినిమా చేద్దామ‌ని ఎప్పుడో అనుకున్నారు. మ‌ధ్య‌లో వీరిద్ద‌రూ క‌లిసి జెంటిల్‌మేన్ సినిమా చేశారు. అయితే ఆ సినిమాలో నాని విభిన్న హావాభావాలు ప‌లికించిన తీరు, రెండు పాత్ర‌ల్లో నాని న‌ట‌నను చూసిన అత‌డు క‌థ‌ను మార్చేశాడ‌ని స‌మాచారం. అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. నానీకి జీవితంలో మర్చిపోలేని సినిమా ఇవ్వాలనేది శ్రీనివాస్ లక్ష్యంగా క‌నిపిస్తోంది.

నాని ఈ కొత్త స్క్రిప్ట్ న‌చ్చింద‌ని తెలుస్తోంది. నాని ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధంలో నటిస్తున్నాడు. ఆ సినిమా త‌ర్వాత త‌న నిర్మాణంలో అ! సినిమాలో శ్రీనివాస్ అవసరాల న‌టిస్తున్నారు. ఇంక రెండు సినిమాలు నాని చేతిలో ఉన్నాయి. వాటి త‌ర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -