Friday, May 3, 2024
- Advertisement -

బాలీవుడ్ హీరో కూతురుతో స‌య్యాట‌కు రెడీ అయిన ప్ర‌భాస్

- Advertisement -

ఒక సినిమా ఇంకా షూటింగ్‌లోనే ఉండ‌గా మ‌రో సినిమాను ప్ర‌భాస్ ఓకే చెప్పేశాడు. గోపిచంద్‌తో జిల్ తీసిన దర్శకుడు రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ అంగీక‌రించాడు. అయితే ఈ సినిమాలో కూడా బాలీవుడ్ భామ న‌టిస్తుంద‌ని స‌మాచారం వినిపిస్తోంది. ఇప్ప‌టికే సాహో సినిమాలో అషికీ-2 హీరోయిన్ న‌టిస్తోంది. ఈ సినిమా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనెను అడ‌గ్గా ఆమె పద్మావతి విడుద‌ల తర్వాత చెప్తానంది. ఇప్పుడు ఆ సినిమా విడుద‌ల‌యినా దీపిక స్పందించ‌లేదంట‌. దీపికా ప్రభాస్‌కు సినిమాకు హాండ్ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్‌ను అడిగారట. సారా సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్ కూతురు. ఈ అమ్మ‌డు కేద‌ర్‌నాథ్ సినిమాతో సినీ అరంగేట్రం చేయ‌నుంది. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజపుట్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

సారా ఈ ఆఫ‌ర్‌పై ముచ్చ‌ట‌ప‌డుతోందంట‌. స్క్రిప్ట్ వినడానికి సిద్ధ‌య్యిందంట‌. స్క్రిప్ట్ బావుంది కానీ త‌ల్లి అనుమతి తీస్కోవాల‌ని చెప్పిందంటం. ఆమె కోసం ప్రభాస్ కూడా ఎదురుచూస్తున్నాడు. ఇది ఓకే అయితే సారా ప్రభాస్ ప‌క్క‌న క‌నిపించే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -