Sunday, May 19, 2024
- Advertisement -

ఇప్ప‌టికే ల‌వ‌ర్‌తో డేటింగ్‌.. త్వ‌ర‌లోనే శృతి హాస‌న్‌ పెళ్లి

- Advertisement -

తండ్రి వార‌స‌త్వాన్ని న‌మ్మ‌కోకుండా స్వ‌త‌హాగా సినీ ప్ర‌పంచంలోకి వ‌చ్చిన సుంద‌రి శృతి హాస‌న్‌. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ వ‌రుస అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకొని సినీ ప్ర‌యాణం కొన‌సాగిస్తోంది. అయితే ఈ అమ్మ‌డికి పెళ్లి క‌ళ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ల‌వ‌ర్‌తో డేటింగ్‌లో ఉన్న ఆమె త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటుంద‌ని టాక్‌.

ఇటాలియన్ సంతతికి చెందిన మైఖేల్ కోర్సేల్‌తో శృతిహాసన్ కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. లండన్‌లో స్టేజ్ యాక్టర్‌గా రాణిస్తున్న మైఖేల్‌ను శృతి ప్రేమిస్తోంది. ప్రియురాలు శృతిహాసన్ కోసం చాలాసార్లు మ‌న‌దేశానికి మైఖేల్ వ‌చ్చాడు. వీరిద్ద‌రూ ప‌లుసార్లు విమానాశ్రయాల్లో జంట‌గా క‌నిపించారు. త‌మ పెళ్లి విష‌యం తండ్రి క‌మ‌ల్‌హాస‌న్‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

శృతిహాసన్ ఇటీవ‌ల తన బాయ్‌ఫ్రెండ్‌ను తన తల్లి సారికకు పరిచయం చేసిందట. ఈ ముగ్గురు కలిసి బ‌య‌ట ఎక్క‌డ‌కో వెళ్తున్న ఫొటో ఇటీవ‌ల విడుద‌లైంది. దీంతో త‌ల్లి ఒప్పుకుంద‌ని, తండ్రి నిర్ణ‌య‌మే ఆల‌స్య‌మ‌ని తెలుస్తోంది.

శృతిహాస‌న్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. ఓ మై ఫ్రెండ్‌, గబ్బ‌ర్‌సింగ్‌, బ‌లుపు, రామ‌య్య వ‌స్తావ‌య్యా, ఎవ‌డు, రేసుగుర్రం, ప్రేమ‌మ్‌, శ్రీమంతుడు త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది. తొలుత ఐర‌న్ లెగ్ అన్న‌వాళ్లు త‌ర్వాత గోల్డెన్ లెగ్‌గా పేర్కొంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -