Thursday, May 9, 2024
- Advertisement -

అవికా గోర్ ఇప్పుడు ఎలా అయిందో చూసారా..?

- Advertisement -

దేశం మొత్తాంగా చిన్నారి పెళ్లి కూతురుగా మంచి పేరు తెచ్చుకుంది అవికా గోర్. తెలుగులో ఉయ్యాలా జంపాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ సడెన్ గా సినిమాలకు దూరమైపోయింది. ట్యాలెంట్.. అందం.. ఆకర్షణ.. పక్కింటి అమ్మాయి లుక్.. టీవీ సీరియల్స్ తో కోట్లాది మందికి పరిచయం.. టీనేజ్ లోనే హీరోయిన్ అయిపోయి కుర్రాళ్లకు తెగ నచ్చేసిన అందగత్తె అంత హఠాత్తుగా సినిమాలకు దూరం కావడం ఏంటి అని అందరు అనుకున్నారు. కానీ అందుకు కారణం ఉంది. ఈ బొద్దు గుమ్మ అనే హ్యాష్ ట్యాగ్ ఈమెకు ఏ మాత్రం నచ్చలేదట.

దాంతో.. గ్లామర్ డాల్ అనిపించేందుకు చాలా ట్రై చేసింది కానీ ఆమె బాడీ అందుకు సహకరించలేదు. అందుకే బోలెడంత కష్టపడిపోయి.. ఇప్పుడు విపరీతంగా చిక్కపోయి సడెన్ గా దర్శనం ఇచ్చింది.. హీరోయిన్ అవికా గోర్. హాఠాత్తుగా చూస్తే.. ఉయ్యాలా జంపాలా నటించినా అవికా గోర్.. ఈమె ఒక్కటేనా అనే అనుమానం కలగకమానదు. అంతగా తనను తాను మార్చేసుకుని మరీ పోజులు ఇచ్చి.. వాటిని నెట్ లో పెట్టేసింది అవికా గోర్. ఈ డ్రెసింగ్.. పోజులు చూస్తే.. అమ్మడు ఫిలిం మేకర్స్ కు ఏం చెప్పాలని అనుకుంటోందో స్పష్టంగానే అర్ధమవుతుంది. అవిక టైమ్స్ రీస్టార్ట్ అయితే మాత్రం అమ్మడిని ఆపడం చాలా కష్టమేమో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -