Wednesday, May 15, 2024
- Advertisement -

రచ్చరవి నిజ జీవితం గురించి తెలుసా..?

- Advertisement -

జబర్ధస్త్ షో.. చాలా మంది కమెడీయన్లు స్టార్స్ ని చేసింది. ఆ షో ద్వారా చాలా మంది జీవితాలు మారాయి. వారిలో ఒకరు రచ్చరవి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రవికి.. కామెడీతో పాటు.. మరో యాంగిల్ ఉంది. అదే సామాజిక బాధ్యత. మనకెందుకు అనకుండా.. నలుగురికి సహాయం చేయాలనుకుంటాడు. అందుకే ల‌క్ష‌మొక్క‌లు నాటాల‌న్న బాధ్యత తనపైన వేసుకున్నాడు. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుడిగా తన పని చేస్తున్నాడు.

అయితే రవి జీవితం ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం.. వ‌రంగ‌ల్ జిల్లా లో హ‌న్మ‌కొండ‌లో ర‌వి పుట్టి పెరిగాడు. త‌న తండ్రి ప్రైవేట్ కారు డ్రైవ‌ర్ గా చేసేవాడు. ఇంటర్ వరకు చదివిన రవి.. ఆ త‌ర్వాత డిగ్రీ,ఎంబీఏ డిస్టేన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా పూర్తిగా చేశాడు. ఇక సినిమాలపై ఇష్టంతో హైదరబాద్ వచ్చి.. ఓ సంస్థ‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. అప్పుడే దుబాయ్ లో అప్పుడే దుబాయ్ లో ఒక‌రేడియో కేంద్రంలో జాకీగా అవ‌కాశం రావ‌డంతో ఛ‌లో దుబాయ్ బాట ప‌ట్టాడు.నెల‌కు ల‌క్ష రూపాయ‌ల‌తో ప్ర‌స్థానం ప్రారంభించాడు.

అక్కడ నుంచి హైదరాబాద్ కి మళ్లీ వచ్చేశాడు. తిరిగి ఓ సంస్థల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తుండగా, 2013 మార్చి 7న జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది. ఇక అంతే ఇప్ప‌టికీ 250 ఎపిసోడ్లు చేశాడు,ఇంకా చేస్తున్నాడు.మ‌ద్య‌మ‌ధ్య‌లో అడ‌పాద‌డ‌పా 40 చిత్రాల్లో చేశాడ‌ట‌. జబర్ధస్త్ ద్వారా అవకాశాలు కలిపించిన శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డికి రుణపడి ఉంటాన‌ని చెప్తుంటాడు. ఇక ఈ రచ్చరవికి కమెడియన్స్ లో బ్రహ్మానందం అంటే తెగ ఇష్టమట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -