Thursday, March 28, 2024
- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఊపందుకోనున్న వ‌ల‌స‌లు…

- Advertisement -

ఏపీలో వైసీపీలోకి కాంగ్ర‌స్ నుంచి వ‌ల‌స‌లు ఊపందుకోనున్నాయి. మరోవైపు జగన్ పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు వైసీపీలో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. పాదయాత్ర ఆర్నెళ్లు సాగనుండడంతో 2018 మార్చి నాటికి పాదయాత్ర బలం… సీనియర్ల చేరికలతో మరింత బలం సమకూర్చుకుని ఎన్నికలకు వైసీపీ సిద్ధం కానుంది.
ఏపీలో మోడుబారిన కాంగ్రెస్ చెట్టుకు మళ్లీ చిగురు వచ్చే సూచనలు ఏమాత్రం కనిపించకపోవడంతో ఆ చెట్టుపై ఉంటున్న పిట్టలన్నీ ఎగిరిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. స‌మ‌యం కోసం అదును చూస్తున్నాయి. ప్ర‌ధ‌నాంగా పిట్ట‌ల‌న్నీ వైసీపీ వైపు చూస్తున్నాయి.
ఇప్పుడు పలువురు మాజీ మంత్రులు వైసీపీ వైపు చూస్తున్నారు. కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కొన్ని నెలల క్రితం ఒక వెబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ జగన్ నుంచి ఆహ్వానం వస్తే వైసీపీలో చేరుతానని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్ వివేకాకు మద్దతు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలు కూడా టీడీపీకి అమ్ముడుపోయినా… డీఎల్ అనుచరులు మాత్రం నిజాయితీగా వైఎస్‌ వివేకాకు ఓటేశారు. అక్టోబర్‌ 27 నుంచి జగన్‌ పాదయాత్ర మొదలుపెడుతున్నారు. ఇడుపులపాయ నుంచే యాత్ర ప్రారంభం కానుంది.అప్పుడే పార్టీలో చేరేందుకు ఆయ‌న‌తోపాటు ప‌లువురు స్థానికులు సిద్దంగా ఉన్నారు.
జగన్ పాదయాత్ర సమయంలో ప్రతి జిల్లాలోనూ పలువురు నేతలు వైసీపీలో చేరేలా ప్రణాళిక రచిస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి కూడా వైసీపీలో చేరుతారని సమాచారం. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు కూడా ఖండించకపోవడం విశేషం.ఇలా పాద‌యాత్ర ముగిసెలోపు పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌ణాలిక‌లు ర‌చిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -