Thursday, May 16, 2024
- Advertisement -

అర మిలియ‌న్ దిశ‌గా నాని సినిమా అ!

- Advertisement -

ప్రయోగాత్మ‌క సినిమాలు తెలుగులో రావ‌డం త‌క్కువ‌. కానీ అలా వ‌చ్చిన సినిమాలు మాత్రం సూప‌ర్‌హిట్‌గా నిలుస్తాయి. అందులో భాగంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ‌, మ‌ర్యాద రామ‌న్న త‌దిత‌ర సినిమాలు బాగా ఆడాయి. ప్ర‌స్తుతం నాని నిర్మాణంలో ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ప్ర‌యోగాత్మ‌క సినిమా `అ!`. ఈ సినిమా విభిన్నంగా.. ప్ర‌యోగాత్మ‌క‌.. ఏ జోనర్ సినిమా అని సినీ విశ్లేష‌కులు చెప్ప‌లేక‌పోతున్నారు.

ఈ సినిమా కొంచెం తెలుగులో బ్యాడ్ టాక్ వ‌స్తున్నా సినిమా దూసుకెళ్తోంది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌రుస క‌డుతున్నారు. ఈ సినిమా బాగుంది అని.. బాగా తెర‌కెక్కించార‌ని చెబుతున్నారు. అయితే ఈ సినిమా కలెక్ష‌న్లు సూప‌ర్‌గా ఉన్నాయి. అమెరికాలో మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది. అ! విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి దాకా రూ.5 లక్షల 15 వేల డాలర్లు రాబట్టి మూడు రోజుల్లోనే అర మిలియన్ మార్క్ దాటేసింది. ఇంకాస్త స్పీడ్‌తో శుక్రవారం నుంచి అదనపు స్క్రీన్లు జోడించుకుంటోంది. హీరో లేకుండా కేవలం నలుగురు హీరోయిన్లతో గతంలో కొత్త తరహా పాత్రలతో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ప‌యోగాత్మ‌క సినిమా అ! జోరుగా ఉంది. ఇదే ట్రెండింగ్ కొన‌సాగితే మిలియన్ మార్క్ అందుకునే అవ‌కాశం ఉంది.

కాజల్, నిత్య మీనన్, రెజినా, ఈషా రెబ్బ, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీశ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా తీస్తున్నారు. అయితే తెలుగులో మాత్రం కొంచెం నెగెటివ్ తీసుకొచ్చారు. అయినా అవేమి ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌లు సినిమా చూస్తున్నారు. దీనికి నాని ఆనందంలో మునిగాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -