Sunday, April 28, 2024
- Advertisement -

ఎంపీల‌కు మ‌ద్ద‌తుగా…. ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం…

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా ప‌వ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. హోదా డిమాండ్ తో ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఎంపిలు రాజీనామాలు చేస్తారని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఎంపీల‌కు మ‌ద్ద‌తుగా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చే విధంగా ఎమ్మెల్యేలు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నే వార్త ఇప్పుడు పార్టీలో సంచ‌ల‌నంగా మారింది .

ఎంపిల రాజీనామాలకు మద్దతుగా తాము కూడా రాజీనామాలు చేస్తే ఎలాగుంటుందని ఎంఎల్ఏల మధ్య చర్చలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంఎల్ఏల రాజీనామా ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. దానికి కొందరు ఎంఎల్ఏలు సానుకూలంగా స్పందించారట. ఆర్కే చేసిన ప్ర‌తిపాద‌న‌కు మ‌ద్ద‌తుగా జగన్ ఆదేశిస్తే తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటానికి సిద్ధమంటూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ప్ర‌క‌టించారు.

రాజీనామాలు ఎందుకు చేస్తున్నామో జ‌గ‌న్‌కు వివ‌రించిన త‌ర్వాత రాజీనామాలు చేయాల‌నే నిర్ణ‌యంతో ఉన్నారు ఎమ్మెల్యేలు. త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల తర్వాత రాజీనామాలు చేస్తే బాగుంటుందని కొందరు ఎంఎల్ఏలు సూచిస్తున్నారు. ప్ర‌కాశం జిల్లా పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ఈ విష‌యంపై క‌లిసేందుకు రెడీ అవుతున్నారు నేత‌లు. ఈనెలాఖరులో జగన్ తో జరగబోయే ఎంఎల్ఏల సమావేశంలో ఎంఎల్ఏల మూకుమ్మడి రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ అందుకు అంగీక‌రిస్తారా అన్న‌ది సందేహ‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -