Friday, May 3, 2024
- Advertisement -

‘అ’ క‌ట్టుకుంటున్న నాని సినిమా థీమ్ పాట‌

- Advertisement -

కొత్త ద‌ర్శ‌కుడు.. కొత్త‌గా నిర్మాణంలో విభిన్న‌మైన సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమానే ‘అ’. నాని నిర్మాణంలో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌లో సినిమా రూపొందుతోంది. ఈ ఫ‌స్ట్‌లుక్‌ల‌తో ఇటీవ‌ల టీజ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా థీమ్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఆ పాట ఆలోచింప‌జేస్తూ.. విన‌డానికి స‌వ్యంగా ఉంది.

‘విశ్వమే దాగినా నాలోనా.. ఎప్పుడూ ఒంటరే నేనానా..చూపులే గుచ్చినా అడగనైనా లేనా.. చేతులే వేసినా ఆపనైనా లేనా..’ అంటూ పాట చిన్నారి పాడుతుంది. ‘ఎంతగా ఎగిరినా తాకుతోంది నేలే..’ ‘యంత్రమే చూపదా నా గమ్యం.’ అంటూ ఓ చిన్నారి గొంతు ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌తో సినిమా క‌థ కొంచెం అర్థ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. ఈ పాట ఆద్యంతం అలరించేలా సాగుతూ చిత్రంపై అమితాసక్తిని కలిగిస్తోంది.

ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన థియేట‌ర్‌ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. చేప పాత్రకు నాని, చెట్టు పాత్రకు రవితేజ వాయిస్‌ ఓవర్‌ చెబుతున్నారు. ఇక చూడాలి ఈ సినిమా ఎలా ఉందో .. ప్రేక్ష‌కుల‌ను ‘అ’క‌ట్టుకుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -