Saturday, May 4, 2024
- Advertisement -

బాబు డైరెక్షన్‌లో మొదటి సక్సెస్ సాధించిన పవన్…. భలే డైవర్ట్ చేశారుగా

- Advertisement -

నట నాయకుడు పవన్ కళ్యాణ్….సమాజాన్ని ఉద్ధరించడానికే ఉన్నానని చెప్పుకుంటూ కుల ప్రయోజనాల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవుతూ ఉండే జెపిలతో చంద్రబాబు తెరతీసిన కొత్త నాటకం ఫస్ట్ సక్సెస్‌ని విజయవంతంగా సాధించింది. యదావిధిగా ఈ విజయం అత్యంత సులభంగా సాధ్యమయ్యేలా తన వంతు పాత్రను అత్యద్భుతంగా పోషించింది బాబు భజన మీడియా. పచ్చ బ్యాచ్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో మరోసారి విజయవంతంగా పూలు పెట్టేశారు.

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబుపైన కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వచ్చిందన్నది నిజం. ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి ప్యాకేజీకి ఒప్పుకోవడం దగ్గర నుంచీ పోలవరం డ్రామాలు, రాజధాని నిర్మాణం విషయంలో అతీ గతి లేకపోవడం లాంటి విషయాలతో చంద్రబాబుపై కోపంగా ఉన్న ప్రజలకు మోడీ దగ్గర బాబు సాగిలపడిన విధానం అస్సలు నచ్చడం లేదు. అయితే బాబు మాత్రం నాలుగేళ్ళుగా ఎంచక్కా మోడీ భజన చేస్తూనే ఉన్నాడు. గట్టిగా రెండు నెలల ముందు వరకూ కూడా మోడీ అద్భుతంగా సాయం చేస్తున్నాడు, ప్యాకేజ్ కేక, దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి ఈ స్థాయిలో సాయం చేయడం లేదు అంటూ మోడీ పాట పాడాడు. అయితే అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికి మోడీ ఒప్పుకోకపోవడంతో బాబుకు ఆగ్రహం వచ్చింది. అసెంబ్లీ సీట్లు పెరగకపోతే జగన్ గెలుపు నల్లేరుపై నడకలా ఉంటుందని లగడపాటితో పాటు తన సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కుండబద్దలు కొట్టేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌కి ఏమీ చేయకపోయినప్పటికీ అసెంబ్లీ సీట్లు మాత్రం కచ్చితంగా పెంచాలని మోడీని డిమాండ్ చేశాడు బాబు. అయితే మోడీ మాత్రం ససేమిరా అన్నాడు. అందుకే మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాస్త వ్యతిరేకత తగిలేలా బాబు ప్లాన్ చేశాడు. అంతకుమించి బడ్జెట్‌లో అన్యాయం చేసినందుకు అయితే అస్సలు కాదు. బడ్జెట్‌లో అన్యాయం జరిగిన విషయం గురించే అయి ఉంటే కేబినెట్ మీటింగ్‌లో టిడిపి కేబినెట్ మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు కేంద్ర బడ్జెట్‌ని ఎందుకు ఆమోదించినట్టు? బాబు అసలు టార్గెట్ అది కాదు. సీట్లు పెంచే నిర్ణయం తీసుకోనందుకు మోడీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కాస్త నిరసన వచ్చేలా చేయాలనుకున్నాడు బాబు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నాలుగేళ్ళుగా ఏం చేస్తున్నావ్? ప్యాకేజ్‌కి ఎందుకు ఒప్పుకున్నావ్? మోడీ బ్రహ్మాండంగా చేస్తున్నాడని నాలుగేళ్ళుగా ఎందుకు మభ్యపెట్టావ్? అని బాబుని నిలదీసే పరిస్థితి.

అందుకే తనపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే పవన్‌ని రంగంలోకి దించాడు. పవన్ కళ్యాణ్, జేపిలను పచ్చ మీడియా అగ్రశ్రేణి సంస్థ యజమాని కలిపాడు. ఈ ఇద్దరి రాజకీయ అడుగుల వెనకాల ఉన్నది ఆయనేనన్నది బహిరంగ రహస్యం. పవన్, జెపిలు మొత్తానికి ఇష్యూ మొత్తాన్ని చంద్రబాబుపై నుంచి డైవర్ట్ చేసి మోడీపైకి నెట్టేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై పోరాటంగా ప్రజల ఆగ్రహాన్ని డైవర్ట్ చేసి పడేశారు. ఇద్దరూ కూడా బాబు ప్యాకేజ్‌కి ఒప్పుకోవడం గురించి కానీ, నాలుగేళ్ళుగా రాష్ట్రానికి ఏమీ రాకపోయినప్పటికీ మోడీని ఎందుకు పొగుడుతూ కూర్చున్నావని కానీ, మోడీతో ఇంకా ఎందుకు పొత్తు పెట్టుకుని ఉన్నావ్, మోడీ ప్రభుత్వంలో టిడిపి కేంద్ర మంత్రులు ఇంకా ఎందుకు ఉన్నారని కానీ ఒక్క ప్రశ్న కూడా అడిగిన పాపాన పోలేదు. నెపం అంతా మోడీపైకి నెట్టే ప్రయత్నం మాత్రం గట్టిగా చేశారు. ఆ రకంగా చంద్రబాబు తప్పులను బ్రహ్మాండంగా కవర్ చేసి బాబు పాపాలను కేంద్రం పైకి నెట్టేశారు. పవన్ జెఏసీ అన్న తర్వాత నుంచీ జరిగిన పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే మాత్రం ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పవన్ పోరాటం చేసేదిశగా సాగుతున్నట్టుగా ఒక్క క్షణం కూడా అనిపించదు. బాబును కాపాడడం కోసం మాత్రం భజన మీడియా, జెపిలతో కలిసి బాబు డైరెక్షన్‌లో సాగుతున్నట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ డ్రామాలతోనే 2019లో కూడా బాబును అధికారంలోకి తీసుకొస్తారేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -