Monday, April 29, 2024
- Advertisement -

‘రంగస్థలం’ తొలి పాట సాహిత్యం.. మ్యూజిక్ అదుర్స్‌గా

- Advertisement -

ఒక్క టీజ‌ర్‌తో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ‘రంగస్థలం’ సినిమా భారీ అంచ‌నాలు సృష్టించుకుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఏ విష‌యాలు చెప్పినా ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమా మొద‌టి పాట‌ను విడుద‌ల చేశారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ‘రంగస్థలం’ రూపుదిద్దుకుంది. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌ల పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రేక్ష‌కుల ఫోన్ల‌లో కూడా బిజీగా ఉన్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ‘చిట్టిబాబు’గా, సమంత ‘రామలక్ష్మి’గా నటిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్, స‌మంత ఇద్ద‌రూ దివ్యాంగులుగా న‌టిస్తున్నారు.

అయితే ఈ సినిమా తొలి పాట ‘ఎంత సక్కగున్నావే..’ మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం (ఫిబ్ర‌వ‌రి 13) విడుద‌ల చేశారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ నుంచి వ‌చ్చిన ఈ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ పాట విడుద‌ల కావ‌డంతో త‌మ ఫోన్ల‌లో విన‌డానికి, డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ పాట రామ‌ల‌క్ష్మిని పొగుడుతూ సూప‌ర్‌గా ఉంది. నో విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చంద్ర‌బోస్ సాహిత్యంగా సూప‌ర్‌గా ఉంది.

ఈ సినిమా ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకొని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -