టాలీవుడ్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయిన సినమా బాహుబలి. ఈ సినిమాలో అన్నీ ప్రత్యేకతలే. సినిమా రిలీజై వెల్లిపోయినా కూడా దీని క్రేజ్ మాత్రం జనాల్లో ఏమాత్రం తగ్గలేదు. సినిమాకు సంబందించి ఏకొత్త విషయం బయటకు తెలిసా ఆసక్తికరమే. తాజాగా ఈ సినిమాకు సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు ఆర్ట్ డైరెక్టర్ సబూసిరిల్.
బాహుబలిలో స్పటిక లింగం నేపథ్యంలో వచ్చే సన్నివేశం కోసం వాటర్ బాటిల్స్ ఉపయోగించి శివలింగాన్ని తయారు చేశాం. తక్కువ ఖర్చు కావటంతో పాటు.. చాలా బాగా వచ్చింది. ఇక రానా రథానికి అమర్చిన తిరిగే కత్తిని.. పూర్వం పంటలు కోయటానికి వాడే కత్తిని స్ఫూర్తిగా తీసుకొని చేశాం. నాజర్ కు ఒక చేయి వైకల్యం ఉన్న చేయిలా కనిపించుంకు ఒక కృత్రిమ చేయిని అమర్చాం. అసలు చేతిని కనిపించకుండా ఉండేందుకు పైన శాలువా లాంటి వస్త్రాన్ని ఉంచాం. అందంగా కనిపించే జలపాతం కోసం ఉప్పును వాడాం. చాలా సీన్లు చూసినప్పుడు సీజీ వాడేశారని అనుకుంటారు.కానీ.. చాలా సందర్భాల్లో అలా జరగదు.
అన్ని సన్నివేశాలకు సీజీ చేయటం సాధ్యం కాదు. అప్పుడే కళాదర్శకుడి అవసరం ఉంటుంది. బాహుబలి మూవీలో వాడిన ఆయుధాల్లో ఎక్కువ శాతం ఫైబర్ గ్లాస్ తో తయారు చేసినవే. బరువు తక్కువగా ఉండి వాడటానికి ఈజీగా ఉండేలా రూపొందించామన్నారు సబూసిరిల్.
