Tuesday, May 14, 2024
- Advertisement -

‘మా’ భ‌వ‌నం కోసం ఒక వేదిక‌పై తార‌లు

- Advertisement -
  • 10న ఒక్క‌ట‌వ్వ‌నున్న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌
  • భ‌వ‌న నిర్మాణం కోసం భారీ ఈవెంట్‌

‘మా’కు భ‌వ‌నం కావాలి అని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ముందుకు వ‌స్తోంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఓ భ‌వ‌న‌మంటూ ఏదీ లేదు. ఒక రూపు, ఒక భ‌వ‌నం అంటూ స‌క్ర‌మంగా లేదు. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా ప్రేవేటు స్థ‌లాల్లోగానీ, స్టూడియోల్లో లేదా.. హోట‌ళ్లల్లో జ‌రుగుతాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సినీ ప‌రిశ్ర‌మ‌కు ఓ భ‌వ‌నం కావాల‌ని త‌లంచి దానికోసం కార్య‌చ‌ర‌ణ రూపొందించింది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ న‌టుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. అంద‌రూ భ‌వ‌న నిర్మాణానికి స‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ భ‌వ‌న నిర్మాణం కోసం సినీ ప‌రిశ్ర‌మ అంతా ఒక చోట‌కు చేర‌నుంది. బేషజాలు వీడి మ‌న‌స్ప‌ర్థ‌లు తొల‌గించుకొని ఇలాంటి కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములైతే తెలుగు ప‌రిశ్ర‌మ అంతా ఒక్క‌టై ఉంద‌ని స‌మాజానికి చాటిన‌ట్ల‌వుతుంది. ఇంత‌కు ఈ భ‌వ‌న నిర్మాణానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలేమిటో చూడండి

మా అనే సంఘం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉంది. అనేక రంగానికి చెందిన అనేక విభాగాల కళాకారులు ‘మా’ లో సభ్యులుగా ఉన్నారు. సొంత‌ భవన నిర్మిస్తున్న‌ట్లు మా జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేశ్‌ ప్రకటించారు. సొంత కార్యాలయం అంటే నిధులు కావాలి కదా.. అందుకే భారీ స్థాయిలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. డిసెంబ‌ర్ 10వ తేదీన కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగబోతోంది. పలువురితో ప్రదర్శనలు.. సీనియర్ నటులకు సన్మానాలతో ఈ కార్యక్రమం భారీగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ, కృష్ణంరాజులు ఈ కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ కూడా తమ వంతు సాయం చేయ‌నున్నారు. పవన్‌క‌ల్యాణ్‌, ప్రిన్స్ మ‌హేశ్‌బాబు, రామ్‌చ‌రణ్, నంద‌మూరి కుటుంబం ఈ ఈవెంట్‌లో భాగస్వామ్యం అవనున్నాయి.ఇక ప‌దో తారీఖున సినీ ప‌రిశ్ర‌మ‌కు ఓ ప్ర‌త్యేక రోజుగా మిగిల్చ‌నుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -