ప్రస్తుతం బాహుబలి 2 వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదల అయిన 5 రోజుల్లోనే ఈ మూవీ ఏకంగా వందల కోట్ల నెట్ కలక్షన్లు సాధించడంతో.. చాలా వరకూ రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయ్. ఇప్పుడు ఏకంగా ఇండియాలో అత్యంతగా వసూలు చేసిన సినిమాగా కేవలం 5 రోజుల్లో బాహుబలి 2 ప్రథమ స్థానంలోకి వచ్చేసింది. నిజానికి ఫుల్ టైమ్ రన్ లో కూడా దంగల్.. పీకె వంటి సినిమాలు 380 కోట్లు ‘నెట్’ కలక్షన్ మాత్రమే ఇండియాలో వసూలు చేశాయి.
ఈ సినిమాలన్నీ కూడా హిందీతో పాటు సౌత్ బాషల్లో కూడా రిలీజయ్యాయ్. అయితే ఆ సినిమాలన్నింటి లైఫ్ టైమ్ కలక్షన్ ను అప్పట్లో బాహబలిః ది బిగినంగ్.. తన లైఫ్ టైమ్ కలక్షన్ తో ఓవర్ టేక్ చేసింది. కాకపోతే బాహుబలి 1 మొత్తంగా ధియేటర్ల నుండి ఇండియాలో 420 కోట్ల నెట్ కలక్షన్ పట్టుకొస్తే.. ఇప్పుడు బాహుబలి 2 మాత్రం ఏకంగా 5 రోజుల్లో 435 కోట్లు తెచ్చేసి మకుటాన్ని ధరించింది. ఆ లెక్కన చూస్తూ ఫుల్ రన్ లో ఇంకెంత తెస్తుందో చూసుకోండి.
ఇప్పటివరకు ఇండియాలో అత్యధికంగా వసూలు చేసిన టాప్ 10 సినిమాలను చూసుకుంటే (నెట్ కలక్షన్).. ఈ విధంగా ఉన్నాయ్.
1) బాహుబలిః ది కంక్లూజన్ – 435 కోట్లు.. (5 రోజులు)
2) బాహుబలిః ది బిగినింగ్ – 420 కోట్లు..
3) దంగల్ – 387 కోట్లు
4) పీకె – 338 కోట్లు
5) బజరంగీ భాయిజాన్ – 317 కోట్లు
6) సుల్తాన్ – 302 కోట్లు
7) ధూమ్ 3 – 275 కోట్లు
8) కిక్ – 213 కోట్లు
9) చెన్నయ్ ఎక్స్ ప్రెస్ – 208 కోట్లు
10) రోబో – 207 కోట్లు
Related