Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబలి 2 సెన్సార్ రివ్యూ

- Advertisement -
baahubali 2 sensor review

భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘బాహుబలి – ది కంక్లూజన్’. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ విజువ‌ల్ వండ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 7500 స్క్రీన్ల‌లో ఈ నెల 28న విడుదల కాబోతుంది. బాహుబ‌లి రూ.600 కోట్ల వ‌సూళ్లు సాధించి అంచ‌నాల‌కు మించి విజ‌యం సాధించ‌డంతో బాహుబ‌లి 2 రూ.600 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

ఇక ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ప్రత్యేకంగా షోను చూసి చిత్రాన్ని U/A సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా ర‌న్ టైం 2 గంటల 47 నిముషాలుగా ఉందని కూడా తెలుస్తోంది. బాహుబ‌లి సినిమాలో కీల‌క ఘ‌ట్టాల‌న్ని రెండో పార్టులోనే ఉండ‌డంతో ఈ సినిమా ర‌న్ టైం ఎక్కువ‌గానే ఉంద‌ని తెలుస్తోంది.

సినిమాలోని చాలా పాత్ర‌ల‌కు ఉన్న ప్రాధాన్యం, సన్నివేశాలు, ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక ప్రస్తుతం, భారీ యుద్ధ సన్నివేశాలు అన్ని రెండో పార్ట్‌లోనే ఉండ‌డంతో బాహుబ‌లి 2 ర‌న్ టైం ఎక్కువుగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు స‌భ్యుల‌కు మైండ్ బ్లోయింగ్ అయిన‌ట్టు తెలుస్తోంది. కుంత‌ల రాజ్యానికి(అనుష్క‌), మ‌హిష్మ‌తి రాజ్యానికి (రానా) వ‌చ్చే వార్ స‌న్నివేశాలు, క్లైమాక్స్‌లో వ‌చ్చే రానా, ప్ర‌భాస్ వార్ స‌న్నివేశాల‌తో బాహుబ‌లి 2 ఓ రేంజ్‌లో ఉంద‌ని..సినిమా బాహుబ‌లిని మించేలా ఉంటుంద‌ని వారు మెచ్చుకున్న‌ట్టు స‌మాచారం.

{youtube} IAMhxMgFZqM{/youtube}

Related

  1. బాహుబలిలో ప్రభాస్ కు ఏ పాత్ర ఇష్టమో తెలుసా..?
  2. బాహుబలి సినిమా పూరి జగన్నాథ్ తీస్తే.. పూరి ఏమన్నారంటే..?
  3. రిలీజ్ కు ముందే బాహుబలి-2 స్టోరీ లీక్.. నెట్ లో హల్ చల్
  4. ప్రభాస్‌ ‘బాహుబలి’కి తీసుకున్న మొత్తం పారితోషికం ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -