Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబలిలో ప్రభాస్ కు ఏ పాత్ర ఇష్టమో తెలుసా..?

- Advertisement -
prabhas like baahubali role

బాహుబలి సినిమా లో ప్రభాస్.. బాహుబలిగానే కాకుండా.. శివుడి పాత్రలో కూడా నటించాడు. ఈ రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం.. అయితే తొలి భాగం చూసినవారికి జనాలకు శివుడి పాత్ర.. అతను చేసిన విన్యాసాలే ఆకర్షించి ఉంటాయి. అయితే ఫ్యాన్స్ ఏమో కానీ.. ప్రభాస్ కు మాత్రం బాహుబలి లోని రెండు పాత్రల్లో టైటిల్ రోలే చాలా ఇష్టమట.

రెండు పాత్రల్లో ఇదే క్లిష్టమైందని కూడా అతను చెప్పాడు. ” శివుడి పాత్ర చేయడం చాలా సులువు.. ఎందుకంటే.. ఆ పాత్రలో ఏం చేసిన.. ఎలాంటీ హావభావాలు ఇచ్చినా.. ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న పర్వాలేదు. కానీ రాజు పాత్రకు మాత్రం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. దానికి కొన్ని పరిమితులున్నాయి. వాటిని ఫాలో కావాల్సి వచ్చింది. అద్భుతమౌబ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గాంభీర్యం చూపించాలి. మేం రెండు పాత్రల మధ్య వైరుధ్యం ఉండాలని భావించాం.

దానికి తగ్గట్లే క్యారెక్టర్ల డిజైనింగ్ చేశారు. నటన కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. బాడీ విషయంలో కూడా తేడా చూపించాను” అని ప్రభాస్ తెలిపాడు. బాహుబలి గురించి చెప్పినప్పుడే తాను ఓ అంచానా వేసానని.. అది నిజం అయ్యిందని తెలిపాడు. మంచు పర్వాతల నుంచి వాటర్ ఫాల్ వచ్చే సీన్ గురించి నాకు రాజమౌళి చెబుతున్నపుడే ఆయన విజన్ ఏంటో.. ఈ సినిమా స్థాయి ఏంటో నాకు అర్థమైంది. ఈ సీన్లను నేను ఊహించుకున్న దాని కంటే అద్భుతంగా తీసాడు రాజమౌళి. హాలీవుడ్ చిత్రాల్లో కంటే బాగుంటుంది ఈ సీన్. ఇలాంటివి తీయడం ఆయనకు మాత్రమే సాధ్యం అని ప్రభాస్ తెలిపాడు. 

Related

  1. ప్రభాస్‌, అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. ఎప్పుడంటే..?
  2. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!
  3. న్యూడ్‍గా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్!
  4. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -