Saturday, April 20, 2024
- Advertisement -

రష్యన్ భాషలో బాహుబలి 2 ట్రైలర్ చూశారా..

- Advertisement -

ఇండియన్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకుపోయిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆ సినిమాలోని కన్ క్లూజన్ ఇపుడు రష్యన్ భాషలో విడుదలవుతుంది. అలాగే ఈ డిసెంబ‌ర్ 29న‌ జ‌ప‌నీస్‌లో విడుద‌ల‌కు నోచుకుంది. ఈ సందర్భంగా ర‌ష్యన్ ట్రైల‌ర్ గురించి శోభు యార్లగ‌డ్డ ట్వీట్ చేసారు.

జ‌న‌వ‌రి 2018లో ఈ చిత్రం ర‌ష్యాలో సైతం విడుద‌లకాబోతోంద‌ని నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాహుబ‌లి 2 ర‌ష్యన్ భాష ట్రైల‌ర్‌ను కూడా ట్వీట్ చేశారు. ఇప్పటికే త‌న పేరు మీద కొత్త కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసుకున్న ‘బాహుబ‌లి 2’, ర‌ష్యన్‌, జ‌ప‌నీస్ భాషల్లో కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ న‌లుమూల‌ల‌కు బాహుబ‌లి 2 తీసుకెళ్లింద‌న‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు.తాజాగా వచ్చిన ఈ ట్రైలర్ చూస్తుంటే సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది. ఎందుకంటే ఇందుల్లో వచ్చే భాషలో బాహుబలి ,భళ్లాళదేవలు చెప్పే డైలాగ్ లు ఎలా ఉంటాయోనని నెటిజన్లను ఆసక్తిచూపిస్తూ మరీ ఈ ట్రైలర్ ను చూసిందే చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -