బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే బాహుబలి దర్శకుడు బాహుబలి-3 విశేషాలను వివరించాడు. బాహుబలి 2 గురించి చెప్పెందుకు.. శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టిన జక్కన్న బాహుబలి-3 గురించి కూడా చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. బాహుబలి అనేది కేవలం ఒక హీరో చుట్టూ తిరిగే కథ మాత్రం కాదన్న జక్కన్న … ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ కంటే కూడా వారు డెవలప్ చేసిన మాహిష్మతి సామ్రాజ్యం అనేది చాలా పెద్దదన్నాడు.
అందుకే ఈ సినిమాను రెండు పార్టులకే పరిమితం చేయడం చాలా కష్టమంటున్నాడు. అందుకని ఇది ట్రయాలజీ అయ్యే ఛాన్సు ఉందని స్పష్టం చేశాడు. ఈ కథను కేవలం రెండో పార్టు తీసి ఆపేయలేం. అందుకే ఈ కథ కంటిన్యూ అవుతుంది అని జక్కన్న అన్నారు. గతంలో కూడా జక్కన్న తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా బాహుబలి-3 ఉంటుంది కాని.. బహుశా వేరే ఇతర నటీనటులతో తీసే అవకాశం ఉంది” అని చెప్పిన సంగతి తెలిసిందే.
ఏది ఏమైనా ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా గొప్పగా తీయడమే గొప్పగా అనిపించిన మనకు బాహుబలి -3 సినిమా కూడా వస్తే మహా అనందమే కదా.. ! అంటే మనకు బాహుబలి-3 కూడా చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో మొత్తానికి బాహుబలి-౩ గురించి జక్కన్న చెప్పిన స్టోరీ ఇదే.
Related