Saturday, May 18, 2024
- Advertisement -

బాహుబలి అట్టర్ ప్లాప్ సినిమా , కారణం ఏంటంటే

- Advertisement -

ఒక దగ్గర సూపర్ హిట్ అయితే అన్ని చోట్లా అవ్వాలి అని రూలేమీ లేదు కదా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ గా సూపర్ హిట్ అయిన బాహుబలి సినిమా ఇప్పుడు పీక్ స్టేజీ లో వసూళ్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆరొందల కోట్ల గ్రాస్ ని లాగేసిన బాహుబలి భారత దేశానికి గర్వకారణం గా మారింది. కేవలం భారతావని కి మాత్రమే పరిమితం అని చెప్పడానికి లేని బాహుబలి జర్మనీ లో మాత్రం అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

పోయిన నెల 28 న అక్కడ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాను 11 కోట్లకు కొన్నవాళ్ళు ఘోరంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటివరకు బాహుబలి అక్కడ మన కరెన్సీలో లెక్కేస్తే కేవలం 9.20 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసి ఆల్ టైం డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ బాజీరావుమస్తానీ కూడా డిసాస్టర్ అయ్యింది. అక్కడివాల్లకి ఇలాంటి విజువల్స్ చూడటం చాలా కామన్ అందులోనూ సినిమా లెంత్ కూడా ఎక్కువ అవ్వడంతో భారీ ఫ్లాఫ్ అయ్యింది.

ఆశ్యర్య౦గా అదే చోట ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన బాలీవుడ్ లంచ్ బాక్స్ సినిమా 4 కోట్ల రెవెన్యూ కలెక్ట్ చేసింది రెండేళ్ళ క్రితం. కానీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమాలు నిరాశని మిగిలించాయి కథ లేకుండా కేవలన్ గ్రాఫిక్ ల మీద మాత్రమే ఆధారపడి ఉండడం తో ఈ సినిమా ప్లాప్ అయింది అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -