Monday, May 13, 2024
- Advertisement -

వాట్సాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌!

- Advertisement -

ప్రస్తుతం ఉన్న ట్రేండ్ లో ఎక్కువ గా సోష‌ల్ మీడియాలో ఫేస్ బుక్, వాట్సాప్ వాడుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో సరికొత్త ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోన్న వాట్సాప్ తన యూజర్ల కోసం ఇప్పటికే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్కైప్‌, యాపిల్ ఫేస్‌టైమ్‌ వంటి పోటీ యాప్స్‌ ను తట్టుకొని నిలబడటానికి తాజాగా మరో ఫీచర్‌ను వాట్సాప్ త‌న యూజ‌ర్ల కోసం తెస్తోంది. ఈ కొత్త ఫీచ‌ర్‌తో తన వినియోగదారులు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం కూడా కల్పించేందుకు వాట్సాప్ రెడీ అవుతోంది. దీని ద్వారా డాటా కనెక్షన్‌ ఉపయోగించుకొని వినియోగదారులు ఫేస్ టు ఫేస్ వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది.

‘వీడియో కాల్స్‌’తో పాటు మరిన్ని మేజర్ ఫీచర్లను కూడా యాడ్ చేసేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. రానున్న వాట్సాప్‌ అప్‌డేట్స్‌లో పెద్ద ఫీచర్లే అందుబాటులోకి రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నోటిఫికేషన్‌ నుంచి కాల్‌బ్యాక్‌ చేసుకునే సౌకర్యం, జిప్‌ ఫైల్‌ షేరింగ్‌, వాయిస్‌ మెయిల్‌ తదితర ఫీచర్లూ రాబోయే అప్‌డేట్‌లో అందుబాటులోకి రానున్నాయని సంస్థ ఇటీవల నివేదికల్లో వెల్లడైంది. ఇప్పటికే పీడీఎఫ్‌ షేరింగ్‌… తదితర కొత్త ఫీచర్లు వాట్సాప్‌లో కొత్తగా వినియోగంలోకి వచ్చాయి. దీంతోపాటు యాప్‌ను ఓపెన్ చేయకుండానే ఉపయోగించుకునే విధంగా కాల్ బ్యాక్ అనే ఓ కొత్త ఫీచర్‌ను కూడా వాట్సప్‌లో అందించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కొత్త ఫీచర్లతో కూడిన వాట్సప్ అప్‌డేట్ ఎప్పుడు విడుదలవుతుందా అని యూజర్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -