Friday, May 10, 2024
- Advertisement -

అసలు మొత్తం ఎంత: బాహుబలి.. కథ కన్నా బడ్జెట్టే పెద్ద మిస్టరీ!

- Advertisement -

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ సినిమా బాహుబలి కథ గురించి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఈ సినిమా కథగురించి ఫేస్ బుక్ లలో.. వాట్సప్ లలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరి కథ గురించి ఇలాంటి గెస్సింగ్స్ జరిగిపోతున్నాయి కానీ.. ఈసినిమా బడ్జెట్ మాత్రం చాలా పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

250 కోట్ల రూపాయల నుంచి 120 కోట్లరూపాయల వరకూ ఒక్కోరు ఒక్కో ఫిగర్ చెబుతున్నారు.  మరి తేడానే సగానికి సగంఉంది! ఒకరు ఈ సినిమా మొత్తాన్ని 120 కోట్ల రూపాయల్లో పూర్తి చేశారని అంటే.. మరొకరు కాదు150 కోట్లు అంటారు. ఇంకోరు 250 కోట్లు అని చెబుతారు. ఇలా ఎవరికి తోచిన ఫిగర్ ను వారుచెబుతున్నారు. రెండు పార్టులు గా రాబోయే ఈసినిమా గురించి తొలిపార్టుకు ఒక మొత్తాన్ని.. మరో పార్టుకు మరో మొత్తాన్ని కూడా చెబుతున్నారు.

ఎక్కడా క్లారిటీ లేదు.. తొలి పార్టుకు ఎంత ఖర్చు పెట్టారు.. రెండో పార్టుకు ఎంత ఖర్చు పెట్టారు అనే అంశాల గురించి వివరణ ఇచ్చే నాథుడు లేడు. ఈ సినిమా యూనిట్ కూడా ఎవరికి కావాల్సిన ప్రచారం వారుచేసుకోండి అన్నట్టుగా వదిలేశారు. ఇలాంటినేపథ్యంలో కాస్తంత లోతులకు వెళ్లి విచారిస్తే.. మొత్తంగా బాహుబలిరెండుపార్టులనూ 175 కోట్ల రూపాయల్లో రూపొందిచేశారని తెలుస్తోంది. అసలు బడ్జెట్ ఎంతో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -