Thursday, May 16, 2024
- Advertisement -

తండ్రి ఎంపీ…. కూతురు మామిడి పండ్లు అమ్ముకుంటుంది….

- Advertisement -

ఆమె పుట్టుకతోనే కోటీశ్వరురాలు. ఏదైనా అనుకుంటే క్షణాల్లో ఆమె ముందుకు తెప్పించుకునే సత్తా ఆమె ఫ్యామిలీకి ఉంది. ఎనిమిది సార్లు పార్లమెంట్‌లో ఒక ఎంపీగా బాధ్యతలు నిర్వహించిన ఒక ఎంపీ కూతురు ఆమె. అంత పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, పేరు ప్రతిష్టలు గల కుటుంబలో పుట్టి, రోడ్డు మీద మామిడి పండ్లు అమ్ముకుంటూ  మానవతా విలువలకు ఆదర్శంగా నిలుస్తోంది ఈ మహిళ.

ఆమె గొప్పదనం గురించే ఈ స్టోరీ ప్రాముఖ్యత.

మాజీ లోక్‌సభ డిప్యూటి స్పీకర్ కత్రియ ముందా కూతురు చంద్రవతీ సరు. ఈమె జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖుంతి అనే టౌన్‌ వీధిలో  టీచర్‌గా పని చేస్తూ, మామిడిపండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది. 

ఆమె ఒక జాతీయ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో యువతకు సందేశాన్ని ఇచ్చింది.  నేను ఒక ప్రముఖ రాజకీయవేత్త కూతురిగా ఉండి రోడ్డు మీద మామిడి పండ్లు అమ్ముతున్నందుకు నాకు సిగ్గుగా లేదన్నారు. ఇప్పుడున సమాజంలో యువకులు వ్యవసాయాన్ని వృత్తిగా చేయాలంటే సిగ్గు పడుతున్నారు. అలాంటి వారికి తెలియ చెప్పటానికే నేను ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అమ్మిన మామిడి పండ్లతో వచ్చిన డబ్బులను ఎవరికైనా విరాళాంగా ఇచ్చేస్తోంది. మా నాన్న నాకెప్పుడూ అడ్డు చెప్పేవారు కాదు. నేను నా తండ్రి నుంచి నేర్చుకున్నది, వారసత్వంగా తీసుకున్నది ’ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది’ ఆమె చెప్పుకొచ్చారు. 

ఈమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఎంతమంది యువకులు మారతారో చూడాలి.      

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -