Sunday, May 19, 2024
- Advertisement -

68కోట్లు… 100 కోట్లు…. 160కోట్లు….?

- Advertisement -

టాలివుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ’బాహుబలి’ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 160 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త సంచలనాన్ని సృష్టించింది బాహుబలి.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 68కోట్లకు పైగా వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించగా… రెండో రోజు, మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించి 160 కోట్లకు పైగా వసూల్ చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఇక బాలివుడ్‌లో డబ్బింగ్ సినిమా ఈ రేంజ్‍లో బాక్సాపీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోల రికార్డులు కనుమరుగయ్యాయి. ఇక ఈ వారంలో కూడా 100 కోట్ల ట్రేడ్ మార్క్‌ను దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇండియన్ బాక్సాపీస్ రికార్డును బద్దలు కొట్టినట్లే.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16౦ కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 33.5 కోట్లు
తమిళనాడు – 16 కోట్లు
ఒక్క అమెరికాలోనే 23కోట్లు
కేరళ – 2.7 కోట్లు
కర్ణాటక తెలుగు వెర్షన్ – 21కోట్లు
ఏపి – తెలంగాణ – 53 కోట్లు  ఇప్పటివరకు వసూలు చేసిందని ట్రేడ్ యూనియన్ వర్గాల సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -