గోదవరి పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 25 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లలు కూడా తీవ్ర గాయాలపాలయ్యారని సమాచారం. గాయపడిన వారిని 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారిక సహాయక చర్యలు చేపట్టారు. పుష్కర ఘాట్ వద్దకు ఒకేసారి భక్తులందరూ తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. సిఎం చంద్రబాబు నాయుడు పుష్కర స్నానం ఆచరించి వెళ్ళగా అదే సమయంలో ఒక్కసారిగా భక్తిలు దూసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
చిన్నపిల్లలు, వృద్దులు హాహాకారాలు చేశారు. దాదాపు 30 నిమిషాల వరకు భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పుష్కర ఘాట్ల వద్ద అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంటో సర్వత్రా విమర్శలు నెలకొంటున్నాయి.
