Sunday, May 12, 2024
- Advertisement -

బాహుబలి సినిమా మరో కొత్త సంచలనం..!

- Advertisement -

బాహుబలి సినిమా వచ్చి యాభై రోజులు అవుతున్నా కూడా నైజాం ఏరియాలో కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. మరే తెలుగు సినిమా రాబట్టలేని కలెక్షన్స్‌ను బాహుబలి నైజాం ఏరియాలో సాధించింది.

ఏకంగా నలభై కోట్ల రూపాయలు కేవలం నైజాం ఏరియాలోనే రాబట్టడం విశేషం. ప్రపంచ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన బాహుబలికి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు 600 కోట్లు ప్రపంచ వ్యాప్రంగా కలెక్షన్స్‌ను సాధించినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇదే ఏరియాలో శ్రీమంతుడు సినిమా కూడా 19.27 కోట్ల వసూలు సాధించి రెండో ప్లేస్‌లో రికార్డు నమోదు చేసుకుంది. 

భారతీయ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ అన్నది ఒక కలగానే మిగిలిపోయింది. భారతీయ చలనచిత్రంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, కలెక్షన్స్‌లో చరిత్ర సృష్టించిన మన తెలుగు చిత్రమైన బాహుబలి ఆ అవార్డు కోసం  అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అద్బుత సృష్టి బాహుబలి, ఇటీవలే ఆస్కార్‌ నామినేషన్‌కు ఎన్నికైనట్లు తెలుస్తోంది. మరి మన జక్కన్న అదృష్టం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -